వైరల్‌ వీడియో : లగేజ్‌ స్కానింగ్‌ మిషన్‌లోకి దూరిన చిన్నారి

భద్రతపరమైన ఏరియాల్లో ముఖ్యంగా సున్నితపు ఏరియాల్లో అణువణువు కూడా శోదిస్తూ, పరిశోదిస్తూ ఉంటారు.పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ప్రతి చిన్న వస్తువును కూడా తీక్షణంగా చూసే టెక్నాలజీ వచ్చింది.

 Chinese Girl Climbs Through Baggage X Ray Machine-TeluguStop.com

బ్యాగుల్లో బాంబులు, గన్స్‌, కత్తులు వంటివి క్యారీ చేయకుండా ఉండేలా లగేజ్‌ స్కానింగ్‌ మిషన్‌లు వచ్చాయి.లగేజ్‌ స్కానింగ్‌ మిషన్‌లోక ఏదైనా బ్యాగ్‌ను పెట్టామంటే దాన్ని క్షుణ్ణంగా సదరు మిషన్‌ పరిశీలిస్తుంది.

అందులో ఏ లోహపు వస్తువు ఉనాన కూడా వెంటనే ఐడెంటిఫై చేస్తుంది.అలాంటి లగేజీ మిషన్‌లోకి మనుషులు వెళ్తే ఎలా ఉంటుంది.ఈ ప్రశ్న ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది కదా అనుకోకుండా ఒక పాప లగేజీ స్కానింగ్‌ మిషన్‌లోకి వెళ్లింది.ఆ పాప కావాలని వెళ్లలేదు, అధికారులు ఆ పాపను స్కానింగ్‌ మిషన్‌లోకి పంపించలేదు.

కాని ఆ పాప ఆడుకుంటూ లగేజ్‌ మిషన్‌ను పట్టుకుంది.దాంతో లగేజ్‌ మిషన్‌లోకి ఆ పాప వెళ్లి పోయింది.

లగేజీ మిషన్‌లోకి వెళ్లి పోయినా ఆ పాపను అన్ని వస్తువుల మాదిరిగానే స్కానింగ్‌ చేసింది.స్కానింగ్‌లో చూసి అంతా కూడా అవాక్కయ్యారు.అధికారులు ఇలాంటి పని జరగడంతో అప్రమత్తం అయ్యారు.పాపాయికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కనుక సరిపోయింది.లేదంటే చాలా సీరియస్‌ ఇష్యూ అయ్యేది అంటూ ఆందోళన చెందుతున్నారు.

ఈ సంఘటన చైనాలో జరిగింది.చైనాలోని షాన్‌ డోంగ్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వైరల్‌ అయ్యింది.పాపాయి విమానాశ్రయం స్కానింగ్‌ మిషన్‌లోకి వెళ్లి క్షేమంగా వెళ్లి రావడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

చిన్న పిల్లలు అల్లరి చేయడం చాలా కామన్‌.అయితే ఈ పాపాయి మరీ అల్లరి పిల్లలగా ఉందే అంటూ అంతా ఆ పాపను అంటున్నారు.

ఈ పాపాయితో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube