చైనీస్ వంటల్లో ఆ రుచికి కారణం తెలుసా?  

Chinese Food Recipes And Cuisine Ideas-

మనం చైనీస్ వంటకాలంటే చాలా ఇష్టపడతాం.దానికి వాటిలో వాడే కొన్ని రకాల పదార్ధాల వలన వాటికీ మంచి రుచి వస్తుంది.

చైనీస్ వంటకాలు అనగానే మంచూరియా, నూడుల్స్ వంటివి గుర్తుకు వస్తాయి.ఇప్ప్పుడు చైనీస్ వంటల్లో రుచిని కలిగించే పదార్ధాల గురించి తెలుసుకుందాం.

Chinese Food Recipes And Cuisine Ideas- Telugu Viral News Chinese Food Recipes And Cuisine Ideas---

సొయా సాస్

సొయా సాస్ అనేది తక్కువ మరియు ఎక్కువ ఘాడతల్లో దొరుకుతుంది.మాంసాహారం వంటకాల్లో అయితే ఎక్కువ ఘాడత కలిగిన సొయా సాస్,శాఖాహార వంటల్లో తక్కువ ఘాడత కలిగిన సొయా సాస్ ని వాడతారు.

వెల్లుల్లి,అల్లం

వెల్లుల్లిని చైనీయులు దాదాపుగా 5ooo సంవత్సరాలకు పైగా వంటల్లోను, సాంప్రదాయ వైద్యంలోను వాడుతున్నారు.ప్రతి చైనీస్ వంటకంలో తప్పనిసరిగా అల్లం,వెల్లుల్లి ఉంటాయి.

నువ్వుల నూనె

చైనీస్ వంటకాల్లో ముదురు రంగు, ఘాటు ఎక్కువగా ఉన్న నువ్వుల నూనెను వాడతారు.సాధారణంగా మాంసాహార వంటల్లో నువ్వుల నూరు=నూనెను మాంసానికి పట్టించటం చివరలో చిలకరించటం చేస్తారు.

చిల్లీ సాస్

ఈ సాస్ ని ఘాటు ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చితో తయారుచేస్తారు.స్పైసి పదార్ధాల తయారీలో వాడుతూ ఉంటారు.

ఉల్లికాడలు

వీటిని ఉడికించి లేదా పచ్చిగానూ వాడతారు.పచ్చిగా పదార్ధాలపై గార్నిషింగ్ కొరకు ఎక్కువగా ఉపయోగిస్తారు.

.

తాజా వార్తలు