దొంగ కోళ్లు పడుతు, చిల్లర దొంగతనాలు చేస్తున్న బీఎండబ్ల్యూ కారు ఓనర్‌.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వింత

కార్లు మరియు బైక్‌లను కొనడం ఈమద్య కాలంలో పెద్ద విషయం ఏమీ కాదు.కాని వాటిని మెయింటెన్‌ చేయడం పెద్ద సమస్యగా మారింది.

 Chinese Farmer Steals Chickens And Ducks Sells Them To Cover Fuel Costs Of His-TeluguStop.com

విపరీతంగా పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరల కారణంగా కారు కొనాలని ఉన్నా, కొనేన్ని డబ్బులు ఉన్నా కూడా ఆ తర్వాత పరిస్థితి గురించి ఆలోచించి చాలా మంది కారును కొనకుండానే ఉంటున్నారు.కారును కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే దానికి ప్రతి రోజు పెట్రోల్‌ పోయించడం, ఇక దానికి సంబంధించిన మెయింటెన్స్‌ చేయించేందుకు నెలకు వేలకు వేలు ఖర్చు అవుతూనే ఉంటాయి.

అయితే చైనాకు చెందిన ఒక వ్యక్తి కారుపై మోజుతో కొని ఆ తర్వాత నానా అవస్థలు పడ్డాడు.

దొంగ కోళ్లు పడుతు, చిల్లర దొంగ

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైనాకు చెందిన ఒక రైతుకు కార్లు అంటే చాలా మోజు.ఎప్పటి నుండో బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయాలనే కోరిక అతడి మదిలో ఉంది.ఇక చివరకు తనకు ఉన్న వ్యవసాయ భూమిని మొత్తం అమ్మేసి రెండు కోట్లతో బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు.

కారు కొన్న తర్వాత కొన్నాళ్ల వరకు బాగానే ఉంది.చేతిలో ఉన్న డబ్బులు అయిపోయిన తర్వాత అతడి పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది.కారును ఎక్కడకు తీసుకు వెళ్లాలన్నా కూడా వేలకు వెల పెట్రోల్‌ పోయాల్సి వస్తుంది.దాంతో అతడి వద్ద డబ్బులు లేక ఇబ్బంది పడేవాడు.

కారు మెయింటెన్స్‌ కోసం చిల్లర దొంగతనాలు మొదలు పెట్టాడు.

దొంగ కోళ్లు పడుతు, చిల్లర దొంగ

తాను ఉండే ఏరియాలో కోళ్లను బాతులను దొంగతనంగా పట్టుకుని అమ్మేసేవాడు.వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో కారులో పెట్రోల్‌ పోసి తిరిగే వాడు.మళ్లీ పెట్రోల్‌ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మళ్లీ ఏదో ఒక చిల్లర దొంగతనం చేసేవాడు.

చిల్లరదొంగతనంకు అతడు బీఎండబ్ల్యూ కార్లోనే వెళ్లేవాడు.స్థానికంగా వరుసగా చిల్లర దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అనుమానంతో లోతుగా ఎంక్వౌరీ చేయగా అసలు విషయం బయట పడింది.

అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు కారును హ్యాండవర్‌ చేసుకున్నారు.

గొప్పలకు పోయి తిప్పలు పడటం అంటే ఇదే.మన స్థాయి ఏంటో తెలుసుకుని, ఆ తర్వాత పరిణామలు ఏంటో తెలుసుకుని కారు కొనుగోలు చేయడం ఎంతైనా మంచిది అంటూ పెద్దలు అంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube