“భారతీయ అల్లుడుని” చంపిన చైనా మామ..శిక్ష విధించిన సింగపూర్ కోర్ట్..!!

భారతీయ అల్లుడు ఏంటి.చైనా మామ చంపేయడం ఏంటి.

 Chinese-origin Businessman In Singapore Jailed For Killing Indian-origin Son-in--TeluguStop.com

సింగపూర్ కోర్టు శిక్ష విధించడం ఏమిటి అనుకుంటున్నారా.సరే అసలు ఏమి జరిగిందంటే.

భారత సంతతికి చెందిన అల్లుడిని , చైనా సంతతికికి చెందిన ఓ మామ అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన కొన్నేళ్ళ క్రితం జరుగగా ఈ కేసుకు సంభందించి తీర్పుని తాజాగా సింగపూర్ న్యాయస్థానం వెల్లడించింది.దాంతో మరో సారి ఈ హత్య ఘటనకు సంభందించిన విషయాలు వైరల్ అయ్యాయి.

ఆ వివరాలోకి వెళ్తే.

తాన్ నామ్ అనే చైనా సంతతికి చెందిన వ్యాపారస్తుడు సింగపూర్ లో వ్యాపారం చేస్తూ బాగా సెటిల్ అయ్యాడు.

అతడి కూతురుని స్పెన్సర్ తుపానీ అనే భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి అయిన తరువాత తన వ్యాపార భాద్యతలు అల్లుడికి అప్పగించాడు తాన్ నామ్.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా డబ్బులు చేతిలోకి వచ్చే సరికి అతడు మామని మోసం చేయడం మొదలు పెట్టాడు.తీవ్ర నష్టాలను తీసుకురావడమే కాకుండా వివాహేతర సంభంధాలు పెట్టుకోవడం మొదలు పెట్టాడు.

మద్యం తాగుతూ, డబ్బుని ఖర్చు పెడుతూ తన భార్యని దూరం పెడుతూ వచ్చిన అల్లుడిపై తాన్ నామ్ తీవ్ర కోపంతో ఉండేవాడు.రోజు కూతురిని కొట్టడం చూడలేని తాన్ నామ్ ఈ కష్టాలు భరించలేక కూతురు ఎక్కడ చనిపోతుందోనని భయపడ్డాడు.2017 లో ఓ రెస్టారెంట్ లో ఉన్న అల్లుడి వద్దకి వెళ్ళిన తాన్ నామ్ కత్తితో అల్లుడిపై దాడి చేసి హత్య చేశాడు.వెంటనే నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.

కోర్టుకు సైతం తన భాదని వివరించి చెప్పి కావాలనే హత్య చేశానని ఒప్పుకోవడంతో పెండింగ్ లో ఉంటూ వచ్చిన ఈ కేసులో తాన్ నామ్ కి ఎనిమిదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube