చైనీస్‌ చాలా అందంగా ఉంటారు... వారి బ్యూటీ ట్రిక్స్‌ ఏంటో తెలుసా  

Chinese Beauty Secrets And Skin Care Tips-pearl Powder,wrinkle Reduction,చైనా ఆడవారు

ప్రపంచంలోని వివిధ దేశాల్లో వివిధ రకాల మనుషులు ఉన్నట్లుగానే వారి రూపాల్లో కూడా వివిధ రకాలు ఉంటారు. కొన్ని దేశాల్లో తెల్లగా ఉంటే, కొన్ని దేశాల్లో చామన చాయగా ఉంటారు, మరి కొన్ని దేశాల్లో మరీ కర్రెగా, నల్లగా ఉంటారు. ఆఫ్రికా వంటి దేశాల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా అంతా కూడా నల్లగా ఉంటారు..

చైనీస్‌ చాలా అందంగా ఉంటారు... వారి బ్యూటీ ట్రిక్స్‌ ఏంటో తెలుసా-Chinese Beauty Secrets And Skin Care Tips

అయితే జపాన్‌ మరియు చైనాల్లో మాత్రం అధిక శాతం మంది తెల్లగా ఉంటారు. ఇక ఇండియా విషయానికి వస్తే మాత్రం తెల్ల వారు, నల్లవారు కూడా ఉంటారు. చైనా అమ్మాయిలు, స్త్రీలు అంత అందంగా, తెల్లగా ఉండేందుకు కారణం ఏంటా అని కొందరు ప్రయోగాలు, పరిశీలనలు చేయగా వారు చేసే రెగ్యులర్‌ పనిలో కొన్ని బ్యూటీ టిప్స్‌ కూడా ఉన్నాయి.

అవి సాదారణమైనవి అయినా కూడా చాలా ప్రముఖంగా పని చేస్తున్నాయి.

చైనా ఆడవారు ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం :

చైనా దేశంలో ఆడ మగ అనే తేడా లేకుండా నెలలో కనీసం ఒకటి రెండు సార్లు అయినా మసాజ్‌ చేయించుకుంటారు. అలా చేయించుకోవడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు, అద్బుతమైన ఫేస్‌ కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు.

అక్కడ జనాలు గ్రీన్‌ టీకి ఎక్కువగా అలవాటు పడతారు. చాలా కాలం నుండి ఉన్న గ్రీన్‌ టీ ఆచారంను ఇప్పటికి కూడా అక్కడ కొనసాగిస్తూ వస్తున్నారు. కాఫీ మరియు సాదారణ టీ కంటే 10 రెట్టు అధికంగా గ్రీన్‌ టీ వినియోగం అక్కడ ఉంటుంది. గ్రీన్‌ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు, అందంగా కూడా కనిపిస్తారు.

మన ఇండియాలో పెసలు కేవలం గారెలకు మాత్రమే వాడుతారు..

కాని చైనాలో మాత్రం ఫేస్‌ ప్యాక్‌గా వినియోగిస్తారు. పెసర్ల పేస్ట్‌ను ఫేస్‌కు అప్లై చేసుకోవడం వల్ల మంచి ముఖ వర్చసు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మన దేశంలో మాదిరిగానే చైనాలో కూడా వడ్లు, బియ్యం ఉంటాయి.

ఆ బియ్యం కడిగిన నీళ్లు మొహంపై అప్లై చేసుకుంటే బాగుంటుంది. చైనీస్‌ అమ్మాయిలు ఎక్కువ శాతం ఈ పద్దతిని రెగ్యులర్‌గా ఫాలో అవుతారు.

చైనాలో అమ్మాయిలు మరియు మహిళలు పుదీనా ఆకులు కూడా ఎక్కువగా తీసుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి బయట పడేయడంతో పాటు, పూదీనా ఆకుల పేస్ట్‌ను మొహంపై అప్లై చేయడం వల్ల మొహం నిగారింపు పెరుగుతుంది.

ఇంకా చైనాలోని వాతావరణం మరియు ఇతరత్ర పరిస్థితులు కూడా వారిని అందంగా ఉంచడంలో ఉపయోగపడుతున్నాయి. మన ఇండియాలో అమ్మాయిలు అందం ముందు వారు దిగదుడుపే. కాని కొద్ది మంది మన ఇండియన్‌ అమ్మాయిల కోసం ఈ బ్యూటీ టిప్స్‌..