అక్కడ మనిషిని తప్ప అన్నీ తింటారు... ఎందుకో తెలుసా?

మన దేశంలో చైనా ఫుడ్ అనగానే ఎక్కువగా గోబీ మంచూరియా, న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇతర ఆహారాలు గుర్తుకు వస్తాయి.మరి చైనా దేశంలో కూడా వాళ్లు ఇలాంటి ఫుడ్ తింటారా…? అంటే మాత్రం అస్సలు కాదు.అక్కడ ఎలుకలతో ఛట్నీ, బొద్దింకలతో ఫ్రై, కప్పలతో ఫలావ్ లాంటి వంటకాలను చేస్తారు.మనం చికెన్, మటన్ సాధారణంగా ఎలా తింటామో అక్కడ పాము నుండి ఎలుకల వరకూ ఏ జంతువునూ వదలకుండా తినేస్తారు.

 Chines Eat All Type Of Animals-TeluguStop.com

కొందరు ఉడకబెట్టినవి కాకుండా జంతువులను పచ్చిగా కూడా తినేస్తారు.చైనా దేశస్తులు ఇలా వింత ఆహారాలను తినటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి.చైనాలో ప్రధానంగా కుందేలు తలతో చేసిన చిల్లీ రాబిట్ హెడ్, కొన్ని వందల సంవత్సరాలు నిల్వ ఉంచిన గుడ్లు, పావురాలతో చేసిన ఫ్రై, పంది మెదడుతో చేసిన రకరకాల వంటలు, బొద్దింకలు, తేళ్లు, జర్రులతో చేసిన వంటలను ఎక్కువగా తింటారు.

పాములతో చేసిన సూప్, తేనెటీగలతో చేసిన ఫ్రై, కుక్క మాంసం, పక్షి లాలాజలంతో చేసిన సూప్, నక్కలు, ఎలుకలతో చేసిన వంటకాలను కూడా తింటారు.

చైనీయులు ఇలా అన్ని జంతువులను తినటానికి ప్రధాన కారణం ఏమిటంటే వారికి ఏ జంతువును వృథా చేసే లక్షణం లేకపోవడమే.బౌద్ధులు జీవిని చంపినా, చనిపోయినా అది వృథా కాకూడదని దానితోనే కడుపు నింపుకోవాలని నమ్మడంతో కాలక్రమంగా జంతువులను తినటమే అలవాటుగా మారింది.

చైనీయులలో కొంతమంది మాత్రమే ఎక్కువగా ఇలాంటి ఆహారాన్ని తింటారు.ఎక్కువ శాతం చైనీయులకు ఆకు కూరలే ప్రధాన ఆహారం.

అందువలన చైనీయులు అంతా క్రూరులే అని మాత్రం భావించవద్దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube