పదహారేళ్లకే పీహెచ్డీ చేశాడు.. 28 ఏళ్లు వచ్చినా పేరెంట్స్ మనీపైనే బతుకుతున్నాడు..

చైనాకు చెందిన జాంగ్ జిన్యాంగ్( Zhang Xinyang ) అనే యువకుడు చాలా చిన్న వయస్సులోనే చదువులో అనేక విజయాలు సాధించి బాల మేధావిగా పేరు తెచ్చుకున్నాడు.జాంగ్ కేవలం రెండున్నరేళ్ల వయసు వచ్చేసరికి వెయ్యికి పైగా చైనీస్ అక్షరాలు నేర్చుకున్నాడు.

 Chinas Youngest Graduate Phd Scholar At 16 Now Lives On Parents Money At 28 Deta-TeluguStop.com

అతని తండ్రి కూడా ప్రతిభావంతుడు, కుమారుడిని ఒక ప్రయోజకుడని చేయాలని మొదటి నుంచి అతనికి మార్గనిర్దేశం చేశాడు.జాంగ్ అనేక క్లాసులు స్కిప్ చేస్తూ కేవలం తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉన్నత పాఠశాలలో ప్రవేశించాడు.

ఒక సంవత్సరం తరువాత, టియాంజిన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్‌లో చైనా హిస్టరీలో అతి పిన్న వయస్కుడైన యూనివర్సిటీ స్టూడెంట్( University Student ) అయ్యాడు.చదువులో గొప్ప ప్రతిభను, సామర్థ్యాన్ని చూపించాడు.

అయితే, వయసు పెరిగే కొద్దీ అతని వైఖరి మారిపోయింది.జాంగ్ 13వ ఏట మాస్టర్స్ డిగ్రీని, 16వ ఏట అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీని అభ్యసించడానికి బీజింగ్‌కు( Beijing ) వెళ్లాడు.

సాధించిన విజయాల వల్ల మీడియా దృష్టిని కూడా ఆకర్షించాడు.

Telugu Academic, Child Prodigy, Chinasyoungest, Demand, Leisurely, Nri, Phd Scho

జాంగ్ బీజింగ్‌లో 275,000 డాలర్ల (రూ.2.29 కోట్లు) విలువైన ఇల్లు కొనమని తన తల్లిదండ్రులను కోరాడు.బీజింగ్‌లో వలస కార్మికుడిలా జీవించడం తనకు ఇష్టం లేదని, తన తల్లిదండ్రులు తనకు సౌకర్యవంతమైన జీవన వాతావరణాన్ని అందించారని చెప్పాడు.ఇతనికి ఇల్లు కొనే స్థోమత అతని తల్లిదండ్రులకు లేదు, కానీ జాంగ్ చదువును వదులుకోవడం వారికి ఇష్టం లేదు.

అందుకే బీజింగ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని, దానిని కొన్నామని అబద్ధం చెప్పారు.అతను తమ కలలను నెరవేరుస్తాడని వారు ఆశించారు.

Telugu Academic, Child Prodigy, Chinasyoungest, Demand, Leisurely, Nri, Phd Scho

కానీ జాంగ్ మాత్రం వారి అంచనాలను అందుకోలేకపోయాడు.ఇప్పుడు, 28 సంవత్సరాల వయస్సులో, అతను ఇప్పటికీ తన తల్లిదండ్రులు చెల్లించే అద్దె అపార్ట్‌మెంట్‌లో( Rental Apartment ) నివసిస్తున్నాడు.వారి సంపాదనపైనే జీవిస్తున్నాడు.అతనికి ఉద్యోగం లేదు, ఏమీ చేయకుండా రోజులు గడుపుతున్నాడు.ఇదే నిజమైన సంతోషం అని భావించి, తన తల్లిదండ్రులపై ఆధారపడటం, ఆదాయం కోసం అప్పుడప్పుడు కొన్ని ఫ్రీలాన్స్ వర్క్‌లతో సంతృప్తి చెందుతుంటాడు.ఇంత టాలెంట్ ఉండి కూడా అతడు దాదాపు ఖాళీగా ఉండటం గురించి తెలుసుకుని చాలామంది షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube