ఇది అదృష్టమా లేక దురదృష్టమా : తలపై బండరాయి పడటంతో 35 ఏళ్లు వచ్చినా 10 ఏళ్ల కుర్రాడిగానే

ఈమద్య కాలంలో మనం తింటున్న ఆహార పదార్థాలు మరియు అందంగా ఉండాలంటూ వాడుతున్న బ్యూటీ క్రీములు మన సహజమైన అందాన్ని దెబ్బ తీస్తుంది.అప్పట్లో 50 ఏళ్లకు వృధ్యాప్య ఛాయలు వస్తుంటే ఇప్పుడు మాత్రం కేవలం మూడు పదుల వయసు దాటగానే వృదులుగా మారినట్లుగా కనిపిస్తుంది.

 Chinas 34 Year Old Man Look Like A Child Because Head Injury-TeluguStop.com

తెల్ల వెంట్రుకలు రావడం, చర్మంపై ముడతలు రావడం ఇంకా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.అయితే చైనాలోని ఒక వ్యక్తికి మాత్రం అదృష్టం కొద్ది 35 ఏళ్లు వచ్చినా ఇంకా 10 ఏళ్ల కుర్రాడి మాదిరిగానే ఉన్నాడు.

Telugu China, Chinaschild, Ksiyantana, Behaive Child-

35 ఏళ్లు వచ్చినా 10 ఏళ్ల కుర్రాడిగా కనిపించడం అనేది అదృష్టం కాదు దురదృష్టం అంటున్నారు.ఇతడి తల్లిదండ్రులు.తమ కొడుకు చిన్న పిల్లాడిగా ఉండి పోయాడని వారు బాధపడుతున్నారు.తమ కొడుకు ఇలా ఉండటం వల్ల పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఆసక్తి చూడం లేదని, చిన్న పిల్లాడంటూ వెళ్లి పోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వింతైన విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.చైనా మీడియాలో వచ్చిన ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Telugu China, Chinaschild, Ksiyantana, Behaive Child-

చైనాలోని క్సియాంటావుకు చెందిన షెంగకాయ్‌ 6 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో తలపై ఒక పెద్ద బండరాయి పడింది.ఆ సమయంలో అతడికి కనీసం రక్తం కూడా రాలేదు.కాని ఆ తర్వాత అతడు తీవ్ర జ్వరంతో బాధపడగా హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.అక్కడ బ్రెయిన్‌లో బ్లడ్‌ క్లాట్‌ అయ్యిందని గుర్తించారు.ఆపరేషన్‌ చేసి తొలగించారు.ఆ తర్వాత అంతా బాగానే ఉంది.

కాని 10 సంవత్సరాలైనా కూడా అతడి పెరుగుదలలో మార్పు కనిపించలేదు.

Telugu China, Chinaschild, Ksiyantana, Behaive Child-

దాంతో మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లగా వైధ్యులు ఆశ్చర్యకర విషయం చెప్పారు.తలపై దెబ్బ తలగడంతో పీయూష గ్రంధి దెబ్బ తిన్నదని దాంతో అతడు పెరిగే అవకాశం కోల్పోయాడంటూ వైధ్యులు చెప్పారు.6 ఏళ్ల వయసులో ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు 35 ఏళ్లు వచ్చినా అలాగే ఉన్నాడు.తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే షెంగకాయ్‌ మాత్రం తన స్నేహితులు అంతా ముసలి వాళ్లు అవుతుంటే నేను మాత్రం ఇలాగే ఉండటం నాకు నచ్చిందని అన్నాడు.భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అంటే తప్పకుండా చేసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube