'బాబు'ని మించిపోయిన 'చినరాజప్ప'..!!  

Chinarajappa Sensational Comments On Sr Ntr-

Vice-leaders and various parties are criticizing Chandrababu for joining the TDP as an opponent for his selfish interests. Nandigas in social media say that Chandrababu Naidu will suffer for power. Talk is heard. Pawan Kalyan Babu has been criticized by the self-styled slogan of Slogan. If the other one after another attacked Babu, the senior leaders of the party took the key responsibility on their shoulders to repel the attacks.

Chinnarajappa, senior senior leader of TDP, said that Chandrababu had dodged with the Congress for the sake of the country, but the 16 regional parties are unanimous to the BJP. Teddy had supported the country's welfare in the PV period.

In the past NTR also supported PV Narasimha Rao. Now, Rahul's Chandrababu Naidu supporting Chinnarajappa has seriously commented that the decision on seat-sharing with Congress in AP has not yet been taken. Chandrababu will take a decision on this issue, but it is now that Telangana is focused on the election. Moreover Mundukoccindannaru in the development of the Congress party in Andhra Pradesh. Rajpada said that they will provide their full support services to give them special status. .

..

..

..

ఎట్టకేలకి చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం టీడీపీకి ఆగర్భ శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారారని వైసీపీ నేతలు, వివిధ పార్టీలు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు..

'బాబు'ని మించిపోయిన 'చినరాజప్ప'..!!-Chinarajappa Sensational Comments On Sr NTR

బాబు సొంత పార్టీలో నేతలు సైతం పై కి చెప్పలేక పోయినా సరే బాబు పై గుర్రుగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మరో పక్క టీడీపీ పార్టీకి స్లోగన్ లా ఉండే ఆత్మగౌరవ నినాదంతోనే పవన్ కళ్యాణ్ బాబు పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇలా ఒకరి తరువాత మరొకరు బాబు పై ముప్పేట దాడు చేస్తుంటే.

ఆ దాడులని తిప్పికొట్టే పనిలో పార్టీలోని సీనియర్ నేతలు కీలక భాద్యతని తమ భుజాలపై ఎత్తుకున్నారు.

అందులో భాగంగానే వివిధ పార్టీలు చంద్రబాబు పై చేస్తున్నఆరోపణలని తిప్పి కొడుతున్నారు ఏపీ హోంశాఖా మంత్రి చినరాజప్ప…టీడీపీ లో సీనియర్ గా ఉన్న చినరాజప్ప మాట్లాడుతూ దేశభవిష్యత్తు కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీ చేశారని స్పష్టం చేశారు.ఎపీకి తీరని ద్రోహం చేసిన బీజేపీ కి తగిన బుద్ధిచెప్పడానికే 16 ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయన్నారు. పీవీ హయాంలో దేశ సంక్షేమం కోసమే తెదేపా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.

గతంలో ఎన్టీఆర్‌ కూడా పీవీ నరసింహారావుకు మద్దతు ఇచ్చారు ఇప్పుడు రాహుల్ కి చంద్రబు నాయుడు మద్దతు ఇస్తే తప్పేంటి అనేట్టుగా చినరాజప్ప తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని త్వరలోనే ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని.అయితే ప్రస్తుతం తెలంగాణా ఎన్నికలపైనే బాబు దృష్టి పెట్టారని చినరాజప్ప స్పష్టం చేశారు…అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ముందుకొచ్చిందన్నారు. ప్రత్యేక హోదాతోపాటు ఏదికావాలన్నా ఇచ్చేందుకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపిందని రాజప్ప తెలిపారు.

అయితే జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే కాంగ్రెస్‌తో కలిసినట్లు తెలిపారు…చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ లో కపడంలేదని మేము కేవలం పొత్తు మాత్రమే పెట్టుకున్నామని రాజప్ప అన్నారు. అయితే చంద్రబాబు రాహుల్ తో కలవడం.

ఎన్టీఆర్ పీవీ కి అప్పటి సందర్భంలో కలవడం ఒకటే అవుతాయా.అంటూ రాజప్పపై పలు విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.చంద్రబాబు చేసిన తప్పులని కప్పి పుచ్చితే మాకు ఏమి పరవాలేదు కానీ ఎన్టీఆర్ ని ఈ విషయంలో లాగడం సరైన పద్దతి కాదని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు..