డ్రాగన్ కంట్రీ ఖాతాలో అరుదైన రికార్డు..!

మనం కరోనాపై పోరాటం చేస్తుంటే మన పొరుగు దేశమైన చైనా మాత్రం అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.నాసా, ఇస్రోలను సైతం వెనక్కి నెట్టేందుకు రెడీ అవుతోంది.

 China Zhurong Rover Successfully Landed On Mars-TeluguStop.com

ఏకంగా అంగారక గ్రహంపైనే కన్నేసింది.చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ ఏడు నెలల అంతరిక్ష ప్రయాణం చేసిన తర్వాత శనివారం ఉదయం అంగారక గ్రహంపై విజయవంతంగా లాండ్ అయ్యింది.

చైనా జాతీయ అంతరిక్ష పరిపాలన విభాగం (సీఎన్‌ఎస్‌ఏ)ఈ విషయాన్ని ధృవీకరించింది.చైనా మొట్టమొదటి రోవర్ జురాంగ్ విజయవంతంగా అంగారక గ్రహంపైకి దిగినట్లు సీఎన్‌ఎస్‌ఏ అప్ డేట్ ఇచ్చింది.

 China Zhurong Rover Successfully Landed On Mars-డ్రాగన్ కంట్రీ ఖాతాలో అరుదైన రికార్డు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంగారక గ్రహంపై అమెరికా మాత్రమే ఇప్పటివరకు రోవర్‌ ని దింపిన జాబితాలో ఉంది.ఇప్పుడు ఆ జాబితాలో చైనా కూడా చేరింది.శనివారం ఉదయం అంగారక గ్రహంపై ఉన్న సున్నితమైన వాతావరణంలో రోవర్‌ ను సురక్షితంగా దింపినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.చైనా ఇక నుంచి అంగారక గ్రహంపై ప్రయోగాలు చేయనుంది.

అక్కడి వాతావరణాన్ని అత్యంత దగ్గరగా రోవర్ ద్వారా పరిశీలించనుంది.వచ్చే ఏడాదికల్లా అంగారక గ్రహంపై సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మిస్తామంటూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది.

చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం కోసం ఓ కోర్ మాడ్యూల్‌ ని గత నెలలో రోదసిలో విడుదల చేసింది.

Telugu 1st Mars Rover, America, China First Rover, China Scientists, China Successfully Landed, China Zhurong Rover, China\\'s, Corona, Isro, Landed On Mars, Mars, Moon, Nasa, Space Station On Mars, Zhurong-Latest News - Telugu

అంతేకాకుండా గతేడాది డిసెంబర్‌ లో చంద్రుడి నుంచి 2 కేజీల రాళ్లను చైనా భూమి మీదకు తీసుకొచ్చింది.వచ్చే నెలలో ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించబోతుంది.తన అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో చైనా వేగం పెంచింది.

ఇన్ని రోజులు తిరుగున్నదే లేని నాసాకు చైనా గట్టి పోటీదారునిగా మారుతోంది.నాసాకి చెందిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ సైన్స్ థామస్ జుర్బుచెన్ ఈ విషయంపై స్పందించారు.

చైనాకి శుభాకాంక్షలు తెలిపారు.కలిసి ముందుకు సాగుదాం.

రెడ్ ప్లానెట్‌ ను మరింతగా అర్థం చేసుకోవడానికి వీలవుతుందని అన్నారు.

#Moon #NASA #Corona #1st Mars Rover #Zhurong

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు