విడ్డూరం : కారు షో రూం వారికి చిల్లరతో చుక్కలు చూపించిన లేడీ కస్టమర్‌  

China Woman Buys Car With 66 Bags Of Coins-

కొన్ని సంఘటనలు చూసిన సమయంలో, చదివిన సమయంలో విడ్డూరంగా అనిపిస్తాయి. అయితే ఆ సంఘటనలో భాగస్వామ్యం అయిన వారికి మాత్రం అది చుక్కలు చూపిస్తాయి. వారికి బాధ, కష్టం అయిన విషయాలు కొన్ని మనకు నవ్వు తెప్పిస్తాయి..

విడ్డూరం : కారు షో రూం వారికి చిల్లరతో చుక్కలు చూపించిన లేడీ కస్టమర్‌-China Woman Buys Car With 66 Bags Of Coins

అది కూడా మామూలుగా కాదు. కడుపు పగిలి పోయేలా నవ్వును తెప్పిస్తాయి. తాజాగా చైనాలో ఒక వింత సంఘటన జరిగింది.

ప్రపంచ ప్రసిద్ది చెందిన కార్ల కంపెనీ వోక్స్‌ వ్యాగన్‌ కారు షోరూం అధికారులు వారు. ఏసీలో కూర్చుని రోజుకు ఒకరు అర వచ్చే కస్టమర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఒక కస్టమర్‌ తన చిల్లరతో మూడు రోజుల పాటు చుక్కలు చూపించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైనాలోని కాన్‌జావ్‌ అనే ప్రాంతంలో ఒక మహిళ కారు కొనుగోలు చేసేందుకు వోక్స్‌ వ్యాగన్‌ షో రూంకు వెళ్లింది. అక్కడ కారును సెలక్ట్‌ చేసింది. పలు కార్లను పరిశీలించి, టెస్ట్‌ డ్రైవ్‌ చేసిన తర్వాత ఆమె కారును బుక్‌ చేసింది. వెంటనే డెలవరీకి కూడా సిద్దంగా ఆ కారు ఉండటంతో పేపర్‌ వర్క్‌ అంతా పూర్తి అయ్యింది.

పేపర్‌ వర్క్‌ తర్వాత ఆమెను డబ్బులు చెల్లించాల్సిందిగా షో రూం అధికారులు అడిగారు. అప్పుడే ఆమె బయట ఉన్న ఒక ఆటోలోంచి 66 బ్యాగులను షో రూంలోకి తెప్పించింది. ఆ బ్యాగ్‌లు చూసి షోరూం వారు అవాక్కయ్యారు. ఏంటి ఇవి, ఎందుకు ఇవి తెచ్చారు అంటూ ఆమెపై చిరాకు పడ్డారు..

అవే డబ్బులు, మీకు ఇవ్వాలనుకున్న డబ్బులు అవే అంటూ ఆమె సమాధానం చెప్పింది. దాంతో అవాక్కయిన అధికారులు తల పట్టుకున్నారు. షో రూంకు చెందిన ముగ్గురు ఏకంగా రెండున్నర రోజుల పాటు లెక్కించి ఆ తర్వాత ఆమెకు కారును డెలవరీ ఇవ్వడం జరిగింది. ఆ మొత్తం డబ్బును నేరుగా బ్యాంకుకు తీసుకు వెళ్లి డిపాజిట్‌ చేయడం జరిగింది.

మళ్లీ బ్యాంక్‌ వారు కూడా దాదాపు రెండు రోజుల పాటు వాటిని లెక్కించాల్సి వచ్చింది..

షో రూం వారికి బ్యాంక్‌ వారికి చిల్లరతో చుక్కలు చూపించిన ఆమె ప్రస్తుతం కార్లో హాయిగా తిరిగేస్తుంది. తనకు 10వ ఏడు వచ్చినప్పటి నుండి కూడా తాను ఆ కాయిన్స్‌ను పోగు చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. చిల్లరతో కారు కొనుగోలు చేసి ప్రత్యేకత చాటుకోవాలనే ఉద్దేశ్యంతో తాను ఇలా చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

ఆమె సరదా ఏమో కాని షో రూం వారికి, బ్యాంకు వారికి పలిగి పోయింది కదా…!