ఆ సంప్రదాయాన్ని రద్దు చేయాలంటున్న ప్రజలు..!

చైనాలో వధూవరులను ర్యాగింగ్ చేయడం ఒక సాంప్రదాయం.వ‌ధూవ‌రుల‌ను ఇబ్బందిపెట్టడి, తిట్టటం, కొట్టటం, నీళ్లలో ముంచేయటం, ఎత్తునుంచి తోసేయటం వంటివి ర్యాంగింగ్ లో భాగాలు.

 China To Ban Naohun Tradition Of Ragging Couples , Tradition, Brideand Groom, Ch-TeluguStop.com

న‌వోహున్’ అనే సంప్రదాయం పేరుతో పెళ్లికొడుకు, పెళ్లికూతర్లను వేధించే సాంప్రదాయం అది.బంధుమిత్రులు ఎవ‌రైనా పెళ్లి వేడుక‌లో చాలా హంగామా చేస్తారు.ఇలాంటి ర్యాంగింగ్ లో కొన్ని సందర్భాల్లో పెళ్లికొడుకు, పెళ్లి కూతరు గాయాలపాలవుతుంటారు.దీంతో న‌వోహున్ సంప్ర‌దాయాన్ని ర‌ద్దు చేయాల‌ని ఇప్ప‌టికే చైనాలోని కొన్ని రాష్ట్రాలు ప్రకటన చేశాయి.

నావోహున్ పేరుతో ఇంటికి వచ్చిన అతిథులు వదూ వరుల్ని గొడవకు దిగుతారు.దీనివల్ల కొన్ని సరదాలు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి.దీనివల్ల విషాద చాయలు కూడా జరుగుతున్నాయి.పెళ్లి కూతుర్ని ఆట‌ప‌ట్టించే పేరుతో వారిని వేధిస్తున్నార‌ని, ముద్దులు పెట్టటం, శరీరంపై ఎక్కడంటే అక్కడ పట్టుకుని నొక్కుతూ లైంగిక వేధింపులు చేస్తున్నారనే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఓ పెళ్లిలో వ‌రుడిని వేధించాల‌ని అనుకున్న అతని ఫ్రెండ్స్ అత‌న్ని త‌ల‌కిందులుగా ఎత్తిప‌డేశారు.దీంతో అత‌నికి త‌ల‌కు పెద్ద గాయం అయ్యింది.మరొక వరుడికైతే బాంబులు పెట్టి మ‌రీ పేల్చేశారు.దాంతో ఆ వ‌రుడు పెద్ద గాయాలు కాకపోయిన ఇబ్బంది కలిగించే గాయాలు అయ్యాయి.

ఇలా వేధింపు ఘ‌ట‌న‌లు ఎక్కువ‌వడంతో ఆ సాంప్ర‌దాయానికి స్వస్తి చెప్పాలని లేకుంటే దాన్ని ఆసరాగా చేసుకుని సంప్రదాయం పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పెళ్లిలో సంప్రదాయంగా మొదలైన ఈ ‘న‌వోహున్‌’ సంప్రదాయానికి చాలా చరిత్ర ఉంది.

హ‌న్ సామ్రాజ్యంలో ఈ వింత ఆచారం ఉండేద‌ని చరిత్ర చెబుతోంది.

Telugu Ban Naohun, Brideand Groom, China, Chinese, Acts, Naohun, Suspend-Latest

దీన్ని అప్ప‌ట్లో నావో డాంగ్‌ఫాంగ్ అనేవారు.కానీ అది రాను రాను సంప్రదాయం కాస్తా ఇబ్బందికరంగా మారింది.మనోవేదనగా మారింది.

వ‌ధూవ‌రుల‌తో సరదాగా ఉండటానికి కొన్ని ఆటలు ఆడేవారు.‘కొత్త కోడ‌ల్ని మామ ఎత్తుకుని న‌డుచుకుంటూ వెళ్లటం ఉండేది.

ఆ సంప్రదాయం ఇద్ద‌రి కుటుంబాలు స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండానికి ఉపయోగపడేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube