వండర్‌ : మరోసారి సృష్టికి ప్రతి సృష్టి చేయబోతున్న చైనా, వారు అనుకున్నది చేస్తే సూర్యుడితో పనిలేదు

చైనా దేశస్తులు దేన్ని అయినా తయారు చేయగలరు, దేనికి అయినా కాపీ చేయగలరు అనేది ప్రతి ఒక్కరి మాట.ఆపిల్‌ ఫోన్‌కు కాపీ చేసి లక్ష రూపాయల ఫోన్‌లను పది వేలకే వచ్చేలా చేసిన ఘనత చైనా వారికి దక్కుతుంది.

చీటింగ్‌లో అయినా అన్నింటిల్లో అయినా కూడా వారిని మించిన వారు మరెవ్వరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతటి ఘన కీర్తిని దక్కించుకున్న చైనా వారు ఇప్పుడు మరో అద్బుతంకు శ్రీకారం చుట్టారు అంటూ సమాచారం అందుతోంది.

భూమికి సూర్యుడి సూర్యరశ్మి చాలా అవసరం.ప్రతి ఒక్కరు కూడా సూర్యరశ్మితోనే జీవిస్తున్నారు.ఈ సృష్టిలో సూర్యుడు లేకుంటే అసలు ఈ సృష్టి లేదు.

ఈ సృష్టి ఇలా ఉండటంకు కారణం సూర్యుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.సమస్త జీవరాశికి జీవించేందుకు సూర్యుడు ఇచ్చే శక్తి చాలా అవసరం.

Advertisement

ఈ సృష్టిలో అన్నింటిని ప్రతి సృష్టి చేయవచ్చు అనుకున్నాం.కాని సూర్యుడి శక్తిని మాత్రం ప్రతిసృష్టి చేయలేమని అంతా ఇంతకాలం అనుకున్నారు.

కాని చైనా శాస్త్రవేత్తలు మరో రెండు మూడు సంవత్సరాల్లో కృత్రిమ సూర్యుడిని తయారు చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఇందుకోసం 7.5 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.సూర్యుడి కంటే 10 రెట్లు ఎక్కువ శక్తివంతమైన కృత్రిమ సూర్యుడిని తయారు చేయబోతున్నట్లుగా వారు చెబుతున్నారు.

దాని వల్ల ఉపయోగం చాలా ఉంటుందని, సూర్యుడు నుండి ఎలా అయితే మనకు శక్తి అందుతుందో అలాగే తాము చేయబోతున్న సూర్యుడి నుండి కూడా శక్తి వస్తుందని వారు చెబుతున్నారు.ఒకవేళ నిజంగానే వారు సూర్యుడిని తయారు చేస్తే ఒక అద్బుతం అని చెప్పుకోవచ్చు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఇలాంటి అద్బుతాలు చైనా వాళ్లకే సాధ్యం అవుతాయని వారు మరోసారి సగర్వంగా చెప్పుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు