దోమలను పెంచేందుకు చైనాలో ఫ్యాక్టరీ.. ఎందుకంటే?

చైనా వాళ్ళకి పని పాట లేదా? ఎప్పుడు మనుషులను హింసించే పనులే చేస్తారా? అని మీకు కోపం వచ్చేసింది కదా! కానీ ఈసారి అలాంటి పని కాదు మంచి కోసమే ఈ ఫ్యాక్టరీ.సాధారణంగా మన ఇంట్లో వాళ్ళు సామెతలు చెప్తుంటారు కదా! ముల్లును ముల్లుతోనే తియ్యాలి అని.

 China To Produce Mosquitoes In Factory,china, Mosquitoes, Factory, Dengue, Malar-TeluguStop.com

అదే సామెత చైనా ప్రజలు కూడా పాటిస్తున్నారు.

చైనాలో దోమల బాధ అధికంగా ఉంది.

రోజు రోజుకు దోమల బాధ పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.ఈ దోమల వల్ల డెగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చి ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దోమల భాద నుంచి బయటపడాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

కానీ ఉపయోగం లేదు.

దీంతో చైనా పరిశోధకులు కొత్తగా ఆలోచించారు.దోమలను దోమలతోనే సంహరించాలని నిర్ణయం తీసుకున్నారు.

వెంటనే దోమలపై పరిశోధన చేసి కొత్తరకం దోమలను తయారు చేశారు.ఈ దోమల్లో బ్యాక్టీరియా, వైరస్ లు ఉండవు.

జన్యువుల్లో మార్పులు చేసి హ్యూమన్ ఫ్రెండ్లీ దోమలను తయారు చేశారు.

ఈ దోమలు మనిషిని కుట్టిన ఏం కాదు.

మగదోమలు ఆడదోమలతో సంపర్కం చెందిన తరువాత ఆడదోమలు గుడ్లు పెడుతాయి.ఆ గుడ్ల ద్వారా వచ్చే లార్వా దోమగా మార్పు చెందగానే మరణిస్తుంది.

దీంతో దోమల వ్యాప్తి తగ్గిపోతుంది.గువాంగ్ జాంగ్లో లో అతిపెద్ద దోమల ఉత్పత్తి ఫ్యాక్టరీ ఉంది.

అందులో వారానికి 50 లక్షల హ్యూమన్ ఫ్రెండ్లీ దోమలను తయారు చేసి చాలా ప్రాంతాల్లో 95 శాతం హానికారక దోమలను నివారించినట్టు చైనా ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube