భారత్ పై చైనా ... ఆ దాడికి సిద్ధం అవుతోందా ...?   China Preparing For Cyber Attack On India     2018-11-08   17:50:44  IST  Sai M

భారత్ ను ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టేందుకు చైనా చూస్తూ ఉంటుంది. నిరంతరం భారత్ పై కవ్వింపు చర్యలకు దిగుతూ… ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థపై చైనా మిలటరీ గురి పెట్టినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. సైబర్ దాడులతో సున్నితమైన రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఇందుకోసం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇప్పటికే రహస్యంగా ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

యూనిట్ 61398 పేరుతో రహస్యంగా భౌగోళిక నిఘా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. సైబర్‌స్పేస్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించడం, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కమ్యూనికేషన్‌ను అవగతం చేసుకోవడం సహా అన్ని కోణాల్లో ఈ ప్రత్యేక యూనిట్ దృష్టి పెట్టింది. ఇంటిలిజెన్స్‌ సంస్థకు చెందిన అధికారి ఒకరు ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ…

China Preparing For Cyber Attack On India-

‘‘చైనాలోని షాంఘై హెడ్‌క్వార్టర్స్‌లో యూనిట్ 61398 కార్యకలాపాలు సాగిస్తోంది. చైనా ఇంటిలిజెన్స్ అధికారుల సాయంతో హ్యాకర్స్ బృందాలు సైబర్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. హ్యాకర్లు విదేశాల్లోని పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసేందుకు ఏపీటీ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం..’’ అని పేర్కొన్నారు. కాగా సమాచారాన్ని సేకరించేందుకు యూనిట్ 61398 హ్యాకర్లు మాల్‌వేర్ ప్రయోగిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ నివేదికను బట్టి తెలుస్తోంది. ఐస్ బ్యాగ్, హిడెన్ లింక్స్, ఏపీటీ సహా ట్రోజన్ మాల్‌వేర్‌కి చెందిన పలు మాల్‌వేర్‌లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నట్టు సమాచారం.