హార్ట్‌ టచ్చింగ్‌ వైరల్‌ వీడియో : తన గుడ్లను కాపాడుకునేందుకు తల్లి పక్షి తాపత్రయం

తల్లి ఏ రూపంలో ఉన్నా కూడా తల్లే అని మరోసారి నిరూపితం అయ్యింది.మనుషులకు మాత్రమే కాకుండా జంతువుల హృదయాల్లో కూడా మంచి మనసు ఉంటుందని, తల్లి హృదయం ఉంటుందని, తన పిల్లలను ఎవరైనా ఏమైనా చేసేందుకు వచ్చినా, ప్రమాదం కలిగించేందుకు ప్రయత్నించినా కూడా తీవ్రంగా ప్రతిఘటించడం జంతువులు మరియు పక్షుల్లో కూడా చూస్తూనే ఉంటాం.

 China Mother Bird Stops Moving Tractor To Protect There Eggs-TeluguStop.com

అంత ఎందుకు కోడి తన పిల్లలను ఎక్కడ కాకి ఎత్తుకు పోతుందేమో అని కంటికి రెప్పలా కాపాడుతుంది.తాజాగా చైనాలో ఒక పక్షి తాను పెట్టి పొదుగుతున్న గుడ్లను కాపాడుకుంది.

హార్ట్‌ టచ్చింగ్‌ వైరల్‌ వీడ�

చైనాలోని ఉలాంకాబ్‌ ప్రాంతంలోని ఒక వ్యవసాయ భూమిలో రైతు ట్రాక్టర్‌తో భూమిని దున్నుతున్న సమయంలో అనూహ్యంగా ఒక పక్షి రెక్కలు లేపి వద్దు అన్నట్లుగా ట్రాక్టర్‌ ముందుకు వచ్చింది.వెంటనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిలిపేశాడు.అసలు ఏముందని చూసేప్పటికి అక్కడ ఆ పక్షిగుడ్లను పెట్టి పొదుగుతుంది.దాంతో అవాక్కయిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడి వరకు వదిలేసి ఇతర భూమిని దున్నేశాడు.ఆయన మంచి మనసుతో ఆ పక్షికి నీళ్లు కూడా పెట్టి నెటిజన్స్‌ ప్రశంసలు పొందుతున్నాడు.

హార్ట్‌ టచ్చింగ్‌ వైరల్‌ వీడ�

ఆ గుడ్ల నుండి కొన్ని గంటల వ్యవధిలోనే పిల్లలు బయటకు రావడం జరిగిందట.ప్రస్తుతం ఈ విడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఒక పక్షి తన రెక్కలు చాచి మరీ ట్రాక్టర్‌కు ఎదురు వచ్చి తన గుడ్లను కాపాడుకుంది అంటే ఆ పక్షిలోని అమ్మతనంను గుర్తించవచ్చు.

అద్బుతమైన అమ్మతనంతో ఆ పక్షి అందరి ప్రశంసలు దక్కించుకుంటుంది.ఈ హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో లక్షలు కాకుండా కోట్ల మంది చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube