వందల ఏళ్లనాటి కవితను షేర్ చేయడంతో వేల కోట్లను పోగొట్టుకున్న ఆ బిలియనీర్..!

అప్పుడప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ మూల్యానికి కారణం అవుతాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.అచ్చం ఇలాంటి ఈ సంఘటన ఒకటి ఓ ప్రముఖ సంస్థ సీఈవో కి జరిగింది.

 Meituan Ceo Wang Xing Shared Old Poem Made His Company Lost 26 Billion Dollars,-TeluguStop.com

ఆయన ఓ ప్రాచీన కవిత ను తన ట్విట్టర్ అకౌంట్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో కొద్ది గంటల్లో ఆయన ఏకంగా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.చైనా దేశానికి చెందిన ఓ బిలీనియర్ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు.

చైనా దేశపు బిలీనియర్ మీట్యుయాన్ సంస్థ సీఈవో వాంగ్ జింగ్ కు ఈ పరిస్థితి ఏర్పడింది.ఈయన తమ దేశ చరిత్రకు సంబంధించిన ఓ కవితను ట్విట్టర్ వేదికను పంచుకోవడం ఈ పరిస్థితికి కారణం అయింది.

సాక్షాత్తు వారి దేశానికి సంబంధించిన కవిత కారణం కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.అతడు షేర్ చేసిన వాక్యాలలో చైనా దేశపు మొట్టమొదటి చక్రవర్తి తనకు సంబంధించిన వ్యతిరేకంగా జరుగుతున్న అసమ్మతిని వ్యక్త పరచడానికి చేసిన ప్రయత్నాల గురించి తెలియజేస్తుంది.

అయితే ఈ విషయాన్ని చైనా దేశ ప్రజలు జింగ్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున చెలరేగాయి.వాంగ్ తన ట్విట్టర్ ఖాతాలో కవితను చదివిన చాలా మంది ఈ విధంగానే భావించడంతో ఆ కంపెనీ షేర్ మార్కెట్ విలువ ఏకంగా 26 బిలియన్ డాలర్లు అనగా భారత దేశ కరెన్సీ లో ఏకంగా రూ.18,365 కోట్లు నష్టపోయింది.ఇలా ఏకంగా 1100 సంవత్సరాల నాటి కవితను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా ఇంతటి భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube