వెరైటీ ఆపరేషన్‌ : 20 ఏళ్లు ముక్కులో ఉంచుకుని ఇప్పుడు తీయించుకున్నాడు

మానవ శరీరం చాలా వింత అమరికలో ఉంటుంది.ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి.

 China Man Nose Blockeed With Tooth So He Removed His Nose Tooth-TeluguStop.com

లేదంటే చాలా సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి.అవయవాలు సరైన భాగంలో లేకుంటే తొందరగా చనిపోతారనే అభిప్రాయం కూడా ఉంది.

ఉండవలసినవన్నీ కూడా ఉంటాయి.కాని కొందరికి వాటి ప్లేస్‌ మెంట్‌ మారుతుంది.

అలాంటప్పుడు వారు సర్జరీ చేయించుకుని వాటిని సరి చేయించుకోవడం జరుగుతుంది.

Telugu China, Chinanose, Doctors, Jhung Binshangh, Teeth Nose-

చైనాలోని 30 ఏళ్ల ఝాంగ్‌ బిన్షెంగ్‌ అనే వ్యక్తి ఒక వింతైన ఆపరేషన్‌ చేయించుకున్నాడు.అరతడికి ఇబ్బందిగా ఉన్న పన్నును అతడు తొలగించుకున్నాడు.అందుకోసం అతడు కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది.

నార్మల్‌గా అయితే పన్ను పీకిస్తే కొంత ఖర్చు అయ్యి కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకోవాలి.

Telugu China, Chinanose, Doctors, Jhung Binshangh, Teeth Nose-

కాని ఇతడు పున్ను పీకించుకుంటే ఎక్కువ ఖర్చు అవ్వడంతో పాటు దాదాపుగా మూడు నెలల రెస్ట్‌ అవసరం అంటూ డాక్టర్లు చెప్పారు.ఈ సంఘటన వింతగా ఉంది కదా.అవును ఇది అత్యంత ఆసక్తికర విషయంగా చైనా మీడియాలో కూడా ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

Telugu China, Chinanose, Doctors, Jhung Binshangh, Teeth Nose-

విషయం ఏంటీ అంటే ఇతడు పీకించుకున్న పన్ను నోట్లోది కాదు.అది ముక్కులో పెరిగింది.ఆ పన్ను అతడు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కనిపించింది.అప్పటి నుండి కూడా ఆ పన్ను వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.ఎట్టకేలకు ఆ పన్నును తొలగించుకున్నాడు.చిన్న వయసులో ఆపరేషన్‌ కరెక్ట్‌ కాదంటూ అతడికి వాయిదా వేస్తూ వచ్చారు.

ఆ తర్వాత కొంత బిజీ ఇతరత్ర కారణాల వల్ల ఆపరేషన్‌ను 30 ఏళ్ల వయసులో చేయించుకున్నాడు.ఇతడి ఆపరేషన్‌ గురించి ప్రస్తుతం అంతా ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube