చైనాపై ఇతర దేశాలు దుష్ప్రచారం.. ఎందుకంటే..

అంతరక్ష ప్రయాణంలో ఆటు పోట్లు.అమెరికా , రష్యా , చైనా, భారత్ ఇలా ప్రపంచ దేశాల్లో చేస్తున్న అంతరిక్ష ప్రయోగాలు కొన్ని పట్టుజారి మానవ వినాశనానికి కారణమవుతున్నాయా? గత నాలుగు దశాబ్దాల క్రితం భూమ్యాకర్షణకు గురైన స్కైలాబ్ భారత్ వైపు దూసుకు వస్తుందనే వదంతులు నిజంగానే ప్రజల్లో భయాందోళనలకు గురి చేసింది.చివరకు దానిని హిందూ మహా సముద్రంలో పడేసేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు.తాజాగా మరో స్పేస్ రాకెట్ భారత్ వైపు దూసుకొస్తుందంటూ అంతరిక్ష శాస్త్ర వేత్తలు ప్రకటించడంతో ఇపుడు అందర్లోనూ టెన్షన్ మొదలైంది…ఇంతకీ ఎంటా సెటిలైట్, దానిని ప్రయోగించిన దేశం ఏది?

 China Long March 5b Rocket Modules Falling On Earth Details, China, Long March 5-TeluguStop.com

అమెరికాలో ఏరోస్పేస్ కార్పొరేషన్ సంస్థ అంతరిక్షంలో ఉప గ్రహాలు, ఇతర వస్తువులను పరిశీలిస్తూ ఉంటుంది.అనుక్షణం అంతరిక్షంలో జరిగే మార్పులను క్షుణ్ణంగా పరిశీలుస్తున్న ఈ సంస్థ ఓ భయంకరమైన నిజాన్ని గమనించింది.2021 మేలో చైనా ప్రయోగించిన ఓ రాకెట్ విడి భాగాలు భూమిపై పడిపో బోతున్నాయంటూ ఏరోస్పేస్ కార్పొరేషన్ హెచ్చరించింది.ఆ రాకెట్ విడి భాగాల గురించి మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే.అవి హిందూ మహాసముద్రంలో పడిపోయినట్లు శాస్ర్తవేత్తలు గమనించారు.ఇపుడు మళ్లా అదే పరిస్థితి నెలకొంది.ఇటీవల చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ. అనే రాకెట్ కు సంబంధించిన భాగాలు భూమిపై పడిపోబోతున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు.మరి కొద్ది రోజుల్లోనే అది భూమికి దిగువ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని హెచ్చరించారు.

అమెరికాతో పాటు ఇండియా సహా దక్షిణాసియా ప్రాంతంలో, ఆఫ్రికా, బ్రెజిల్ తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా కూలిపడే అవకాశం ఉందని ఏరోస్పేస్ కార్పొరేషన్ హెచ్చరించింది.

Telugu America, China, China Rocket, Isro, Nasa, Space-Telugu NRI

గత జూలై 24న లాంగ్ మార్చ్ 5బీ అనే రాకెట్ ద్వారా తమ స్పేస్ స్టేషన్ కు సంబంధించిన మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపింది.ఈ ప్రయోగం అనంతరం రాకెట్ కు సంబంధించి ప్రధాన భాగాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉండిపోయాయి.అవి మెల్లగా భూమ్యాకర్షణకు గురవుతున్నట్లు ఏరోస్పేస్ కార్పొరేషన్ గుర్తించింది.

ఒకసారి దిగువ వాతావరణంలోకి అవి ప్రవేశించగానే.అత్యంత వేగంతో మండిపోతూ భూమిపై పడిపోతాయి.

ఈ నెల జూలై 31 తేదీన రాకెట్ భాగాలు భూమి దిగువ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని ఏరోస్పేస్ అంచనా వేస్తుంది.ఆ రాకెట్ భాగాలు ప్రస్తుతం కదులుతున్న విధానాన్ని పరిశీలిస్తే, దిగువ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత అవి ఏయే ప్రాంతాల్లో పడవచ్చనే అంచనావేసే మ్యాప్ ను ఏరోస్పేస్ రూపొందించిందించనట్లు తెలుస్తుంది.

Telugu America, China, China Rocket, Isro, Nasa, Space-Telugu NRI

ఆ విడిభాగాలు కదిలికలను బట్టి అవి భారత్ వైపే దూసుకొస్తున్నాయని అంచనా వేస్తున్నారు.మరోవైపు కూలిపోతున్న రాకెట్ విడిభాగాల్లో 25.4 టన్నుల బరువైన భారీ బూస్టర్ కూడా ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు.కూలిపోబోతున్న రాకేట్ విడి బాగాలు నివాసాలపై పడితే పెద్ద నష్టమే సంభవిస్తుందని ఏరోస్పేస్ అంచనా వేస్తుంది.

అవన్నీ అపోహలని, ఆబూస్టర్ ద్వారా భూమి పై ఉన్న జనాలకు ఎటువంటి నష్టం వాటిల్లదని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు.చైనా పై కావాలనే కొన్ని దేశాలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరో్పించింది.

మొత్తం మీద ఏరోస్పేస్ కార్పోరేషన్ వేసిన అంచనాలు తప్పి, చైనా శాస్త్రవేత్తలు చెబుతున్న అబద్దాలు నిజమైతే అంతకంటే కావలసిందే ఏముంది?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube