ఇండియాకు మూత్రం సప్లై చేస్తోన్న చైనా... ఎందుకో తెలుసా?

బయోఫార్మాస్యూటికల్ కంపెనీ( biopharmaceutical company ) అయిన భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్( Bharat Serums and Vaccines ) (BSV) ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యం, సంతానోత్పత్తి రంగంలో తన ఉనికిని విస్తరించడంపై దృష్టి సారిస్తోంది.ప్రస్తుతం, BSV ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వంటి చికిత్సలలో ఉపయోగించే ప్రత్యేకమైన సంతానోత్పత్తి హార్మోన్లను అందిస్తుంది.

 China Is Supplying Urine To India Do You Know Why, Bharat Serums And Vaccines L-TeluguStop.com

ఈ హార్మోన్లను ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయి.వాటిలో మన ఇండియన్ కంపెనీ ఒకటి కావడం గర్వించే తగిన విషయం అని చెప్పవచ్చు.

ఈ ఒక్క ఘనతతోనే బీఎస్‌వీ సరి పెట్టుకోవాలని అనుకోవడం లేదు.వచ్చే ఏడాది నాటికి “రీకాంబినెంట్”( recombinant ) అని పిలిచే లాబరేటరీ-మేడ్ రూపంలో అన్ని అగ్ర సంతానోత్పత్తి హార్మోన్లను అందించాలని BSV లక్ష్యంగా పెట్టుకుంది.

ఒకవేళ దీనిని కంపెనీ సాధించగలిగితే చరిత్ర తిరగరాసినట్లు అవుతుంది.అయితే, బీఎస్‌వీ ఉత్పత్తులకు ఒక కీలకమైన ముడి పదార్థం మానవ మూత్రం అయింది.ప్రోటీన్లు మూత్రం నుంచే తీసుకోవాల్సి వస్తోంది.

Telugu Bharat Serums, China, Fertility, Urine, Recombinant, Womens-Latest News -

అయితే సంతానోత్పత్తి హార్మోన్ల( Fertility hormones ) ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియలో చాలా మూత్రం అవసరమవుతోంది.అలానే తగినంత మొత్తంలో మూత్రాన్ని పొందడం సవాలుగా మారింది.ఇక యూరిన్‌లోని ప్రోటీన్ పెళుసుగా, ఉష్ణోగ్రతకు సున్నితంగా ఉంటుంది.

కాబట్టి స్థిరమైన సరఫరాను నిర్ధారించడానికి, BSV ప్రస్తుతం చైనాపై ఆధారపడుతుంది.ఇక్కడ అధిక జనాభా, శీతల వాతావరణం మూత్ర సేకరణను సాధ్యమయ్యేలా చేస్తుంది.

అంతేకాదు ధర కూడా తక్కువే.

Telugu Bharat Serums, China, Fertility, Urine, Recombinant, Womens-Latest News -

ఇతర దేశాల్లో కొన్ని చిన్న సేకరణ కేంద్రాలు ఉన్నప్పటికీ, అవి BSV అవసరాలకు అవసరమైన మూత్రాన్ని అందించలేవు.చైనాపై భారీగా మూత్రం కోసం ఇంకా ఎన్నిరోజులు ఆధారపడాలో ఇండియన్ కంపెనీకి తెలియడం లేదు.సహజ మూత్ర వనరులపై ఆధారపడటం వేస్ట్ అనుకుంటూ తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు రీకాంబినెంట్ టెక్నాలజీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను BSV అన్వేషించడం మొదలుపెట్టింది.

ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే చైనా నుంచి పెద్ద ఎత్తున మూత్రాన్ని దిగుమతి చేయాల్సిన అవసరం ఉండదు.భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ కంపెనీ చేస్తున్న ఈ ప్రయత్నాలు బయోఫార్మాస్యూటికల్ రంగంలో ఆత్మ నిర్భర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube