అమెరికాలో అక్రమ ప్రవేశం కోసం ఇన్ని తిప్పలా...!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసలని అడ్డుకోవడానికి ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ ప్రయత్నాలు అక్రమ వలసదారుల ముందు పనిచేయడం లేదు.రోజుకో రకంగా దారులు వెతుకుతూ పోలీసు బలగాల కళ్ళు గప్పి మరీ అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు.

 China Immigrants Traveling Washing Machine America-TeluguStop.com

ఈ క్రమంలోనే మెక్సికో సరిహద్దు నుంచీ భారీగా వలస దారులు పయనిస్తున్నారని అమెరికా వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

గతంలో ఈ సరిహద్దుల నుంచీ వలస వాసుల తాకిడి ఎక్కువయ్యిందని భావించిన ట్రంప్ ప్రభుత్వం సరిహద్దుల వద్ద భారీ భద్రతని ఏర్పాటు చేయగా వలస వాసులు డ్రైనేజి వ్యవస్థ ద్వారా అమెరికాలోకి చేరుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇలా రకరకాల దారులు వెదుకుతూ అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు.తాజాగా మెక్సికో సరిహద్దుల నుంచీ వివిధ రకాలుగా అమెరికాలోకి ప్రవేశాలు జరుగుతున్నాయని గుర్తించిన అమెరికా పోలీసులు కట్టుదిట్టమైన బద్రతని ఏర్పాటు చేశారు.

Telugu China, Telugu Nri Ups, Machin-

ఈ క్రమంలోనే మెక్సికో నుంచీ అమెరికాలో ప్రవేశిస్తున్న ఓ భారీ గృహఉపకరణాలు కంటైనర్ పై అనుమానం వచ్చిన పోలీసులు దానిని తనికీ చేయగా అందులో 11 మంది చైనా దేశానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు.వారు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి వచ్చారని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.అంతేకాదు వారిలో చాలామంది వాషింగ్ మిషన్ లో దాక్కుని రావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.అయితే వారిని ట్రక్కు డ్రైవర్ ని అదుపులోకి తీసుకు విచారిస్తున్నారు పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube