ముగ్గురు పిల్లల్ని కనండి అంటున్న చైనా..!

ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన చైనా దశాబ్ధ కాలాలుగా సంతానం విషయంలో ఆంక్షలు విధించింది.ఏకైక సంతానం చాలని కొన్నాళ్లు రూల్ పెట్టింది.

 China Green Signal For Three Children , China  , Green Signal , Three Children ,-TeluguStop.com

ఒకే సంతానం వల్ల చైనా జనాభా ఘననీయంగా తగ్గింది.అందుకే ఇప్పుడు చైనా తన పంథా మార్చుకుని ముగ్గురు పిల్లల్ని కనండని అంటుంది.అంతేకాదు ముగ్గురు పిల్లల్ని కనేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలను ప్రకటించింది.వారికి కావాల్సిన సెలవులు, పన్నులను కూడా తగ్గిస్తామని అంటుంది.

2016 నుండి ఇద్దరి సంతానానికి అనుమతి ఇచ్చింది చైనా ప్రభుత్వం.అయినా సరే దేశ జనాభా తగ్గుతుందని గుర్తించి తన పంథా మార్చింది.

ముగ్గురు పిల్లల్ని కనడానికి దంపతులకు చైనా జాతీయ అసెంబ్లీలో చట్టాలని సవరించింది.అందుకు సంబందించిన 20కి పైగా ప్రావిన్సుల స్థానిక చట్టాల్లో కూడా మార్పులు చేసింది.

వివాహానికి కోరినన్ని సెలవులతో పాటుగా మెటర్నరీ లీవ్స్ విషయంలో కూడా భారీ మార్పులు చేసినట్టు తెలుస్తుంది.అంతేకాదు ముగ్గురు పిల్లలు ఉన్న వారికి వివిధ పన్నులను తగ్గించాలని కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉందని సమాచారం.

మొత్తానికి చైనా దేశ జనాభా పెంచాలని గట్టిగా ఫిక్స్ అయ్యారని చెప్పొచ్చు. అందుకే తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube