చైనాలో వర్మకు ఘన స్వాగతం, ఇది వర్మ స్థాయి  

China Grand Welcome To Ram Gopal Varma-kamma Rajyamlo Kadapa Redllu,ram Gopal Varma,tollywood Director Ram Gopal Varma

రామ్‌ గోపాల్‌ వర్మ ఒకప్పుడు తెలుగు జాతి గర్వించే సినిమాలు మాత్రమే కాదు ఇండియన్‌ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలను తెరకెక్కించాడు.ఆయన అద్బుత సినిమాలను వదిలేసి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌.కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ ఏదో ఒక వర్గంను టార్గెట్‌ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు.అల్లాటప్పగా సినిమాలు చేస్తుండటంతో ఆయన అభిమానులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

China Grand Welcome To Ram Gopal Varma-kamma Rajyamlo Kadapa Redllu,ram Gopal Varma,tollywood Director Ram Gopal Varma Telugu Tollywood Movie Cinema Film Latest News-China Grand Welcome To Ram Gopal Varma-Kamma Rajyamlo Kadapa Redllu Ram Varma Tollywood Director

వర్మ నుండి ఎప్పుడెప్పుడు అప్పటిలాంటి సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు వర్మ నుండి ఒక అద్బుతమైన సినిమా వస్తుంది.

నిన్ననే కమ్మరాజ్యంలో సినిమా వచ్చింది.ఆ సినిమా ను చూసిన వారు అంతా కూడా వర్మను తిట్టిన తిట్టుతిట్టకుండా తిరుడుతున్నారు.

ఇదే సమయంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ఇండో చైనీస్‌ మూవీ ‘ఎంటర్‌ది గర్ల్‌ డ్రాగన్‌’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.చైనాలో నేడు ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంకు భారీ ఎత్తున మీడియా హాజరు అయ్యింది.నిన్న ఇక్కడ చాలా మందితో తిట్లు తిన్న వర్మ ఇప్పుడు ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ ట్రైలర్‌ చూసిన తర్వాత ఆయన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు.

కేవలం లోకల్‌ మీడియా మాత్రమే కాకుండా అంతర్జాతీయ మీడియా వారు కూడా ప్రశంసలు కురిపించారు.ఇది వర్మ స్థాయి అంటూ అంతా కూడా అభినందిస్తున్నారు.

ఇలాంటి సినిమాలే చేయాలని అంతా కోరుకుంటున్నారు.

తాజా వార్తలు