ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చిన చైనా..!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే కరోనా మహమ్మారి గురించే.వైరస్ ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు మామూలు జీవితం గడుపుతామని అన్నట్లుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు ప్రజలు.

 China Foreign Ministry Spokesperson Wang Wenbin Warning To Trump, Donald Trump,-TeluguStop.com

అయితే ఈ కరోనా వైరస్ కి కారణమైన చైనా దేశాన్ని అనేక దేశాలు మాటల యుద్ధానికి దిగాయి.కొన్ని దేశాల్లో అయితే కరోనా వైరస్ కారణంగా తమ దేశంలో కలిగిన నష్టాన్ని చైనా భర్తీ చేయాలని కూడా ఆరోపించింది.

అయితే తాజాగా చైనా పాల్పడిన చర్యల కారణంగా భారత్ లో ఏకంగా వందకుపైగా చైనా దేశానికి చెందిన యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి విదితమే.ఇక ఇందులో ఎంతో ప్రాముఖ్యత చెందిన టిక్ టాక్ యాప్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా అమెరికా దేశంలో కూడా ట్రంప్ ప్రభుత్వం టిక్ టాక్ నిషేధించింది.అయితే ఈ విషయంలో ట్రంపు తీసుకున్న నిర్ణయంపై చైనా దేశం మండిపడింది.టిక్ టాక్ బ్యాన్ వల్ల ఏర్పడే పర్యవసానాలకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా విదేశాంగ శాఖ అధికారి వాంగ్‌ వెన్‌ బిన్‌ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

అంతే కాకుండా తమ దేశానికి సంబంధించిన వాణిజ్య కంపెనీలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, వారికి ఎటువంటి ఆపద కొనసాగిన తమ సపోర్ట్ వారికీ లభిస్తుందని తెలియజేశాడు.

అయితే ఈ విషయంలో మాత్రం అమెరికా వైఖరిని తాము పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా దేశ ప్రభుత్వం తన చర్యలతో వాణిజ్య కంపెనీలు, అలాగే ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని చెప్పుకొచ్చాడు.

ఈ పరిస్థితుల వల్ల అమెరికా దేశ చర్యలని… చైనా రాజకీయాల సమీకరణాలను తారుమారు చేయడమే కాకుండా, అణిచివేతకు గురి చేయడంలో ఓ భాగంగా అభివర్ణించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube