మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన చైనా..!!

చైనా దేశంలో 2019 సంవత్సరంలో నవంబర్ లో బయటపడిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి వలన అనేక దేశాలలో ప్రాణ నష్టం మాత్రమే కాక ఆర్ధికంగా కూడా భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది.

 China,lock Down,corona Virus,hebei Province, Corona Pandamic, Uhan Virus, Covie1-TeluguStop.com

ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లు విధించటం తో అనేక రీతులుగా దేశాలు నష్టపోయాయి.ఇటువంటి తరుణంలో మరోసారి చైనా దేశంలో లాక్ డౌన్ విధించటం ప్రపంచ దేశాలకు ఒక్కసారిగా దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు పరిస్థితి మారింది.

Telugu China, Corona, Hebei Province, Lock-Latest News - Telugu

వ్యాక్సిన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న తరుణంలో చైనా దేశం మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్తున్నట్లు వార్తలు రావడంతో ప్రపంచ దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.విషయంలోకి వెళితే చైనా దేశంలో హెబీ ప్రావిన్స్ లోని షిజియాజువాంగ్ నగరంలో తాజాగా 127 కరోనా కేసులు బయటపడ్డాయి.అంత మాత్రమే కాక ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో కూడా అసింప్టొమేటిక్ లక్షణాలు ఉన్న కేసులు బయటపడటంతో వెంటనే అధికారులు హెబీ ప్రావిన్స్, జింగ్టాయ్ సిటీ లను పూర్తిగా నిర్బంధించారు.

రైలు అదేవిధంగా విమానాల రాకపోకలను ఆపేశారు.తాజాగా చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రెండు సిటీలలో దాదాపు 1.80 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో ఉన్నట్లు అయ్యింది.అంత మాత్రమే కాక ఈ రెండు సిటీలలో ఉన్న ప్రజలను బలవంతంగా తీసుకెళ్లి చైనా అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వీడియో ఫుటేజ్ బయటపడటంతో .అంతర్జాతీయంగా ఈ వార్త ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.ఏదిఏమైనా రెండోసారి చైనా దేశంలో లాక్‌డౌన్‌ అనేసరికి ప్రపంచ దేశాలు తెగ భయందోళన చెందుతున్నాయి. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube