China: గడ్డుకాలంలో చైనా! పుచ్చకాయలిచ్చి, మా ఇల్లు తీసుకోండి?

ఓ వైపు కరోనా రక్కసి, మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా యుద్దం… ఈ రెండు అంశాల వలన చైనా ఆర్థిక వ్యవస్థ పతనమయ్యింది.గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కష్టాలు పడుతున్నారు.

 China Give Me A Watermelon And Take Our House-TeluguStop.com

ముఖ్యంగా చైనాలో భారీ ఉద్యోగాలను అందించే రియల్ ఎస్టేట్ కుప్పకూలి పోవటం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.దీంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు బిల్డర్లు కొత్త దార్లు ఎంచుకుంటున్నారు.

పుచ్చకాయలు, పీచెస్‌ పళ్లు, వెల్లుల్లి, గోధుమలులాంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు బదులుగా తక్కువ రేటుకే ఇళ్లను అమ్ముకుంటున్నారు.ఒకవైపు కొనుగోలుదారులేక, మరోవైపు ఇప్పటికే గృహాలను కొనుగోలుచేసిన వారు డబ్బులు చెల్లించక పోవడంతో ప్రాపర్టీలు కొన్నవారు తీవ్ర అర్ధాకభారాన్ని మోస్తున్నారు.

కస్టమర్ల నుంచి డబ్బులకు బదులు పుచ్చకాయలు, గోధుమలు, వెల్లుల్లి వంటి వాటిని తీసుకుంటున్నారు. టైర్ 3, 4 నగరాల్లోని రియల్టర్లు ఈ విధంగా ప్రాపర్టీ కొనుగోళ్లలో రైతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

చైనా హౌసింగ్ మార్కెట్ మందగమనానికి తోడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు బిల్డర్లు డిపాజిట్లు తీసుకోవడంపై ప్రభుత్వ నిషేధం విధించింది.దీంతో తూర్పు నగరమైన నాన్‌ జింగ్‌లోని ఒక డెవలపర్ స్థానిక రైతుల నుండి డౌన్‌పేమెంట్‌గా 100,000 యువాన్ల వరకు విలువైన ట్రక్కుల పుచ్చకాయలను స్వీకరిస్తున్నారట.100,000 యువాన్ల విలువను 5000 కిలోల పుచ్చకాయలుగా లెక్కించడం గమనార్హం.

Telugu China, China Economy, Garlic, Peaches, Estate Traders, Latest, Watermelon

మరో పట్టణమైన వుక్సీలో, మరొక డెవలపర్ పీచెస్ పళ్లను తీసుకుంటున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.దీంతో సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రధాన వెల్లుల్లి ఉత్పత్తి ప్రాంతమైన క్వి కౌంటీలోని గృహ కొనుగోలుదారులు తమ డౌన్‌ పేమెంట్‌లో కొంత భాగాన్ని మార్కెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటున్నారు.కొత్త వెల్లుల్లి సీజన్ సందర్భంగా, క్వి కౌంటీలోని వెల్లుల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని హోమ్‌బిల్డర్ సెంట్రల్ చైనా మేనేజ్‌మెంట్ మే చివరిలో సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube