ఫోన్ ఇవ్వలేదని ప్రియుడుని పదిమందిలో అందరి ముందు  

బాయ్ ఫ్రెండ్ ని అందరి ముందు 52 సార్లు కొట్టిన ప్రియురాలు. .

China Girl Slapped Her Boyfriend 52 Times-china Girl Slapped Her Boyfriend,lovers Day Gift,smart Phone

ప్రేమికుడు ప్రియురాలిని సర్ప్రైజ్ చేయడానికి అప్పుడప్పుడు స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. ప్రియురాలిని మెప్పించడానికి రకరకాల బహుమతులని ఆమెని సంతోషపరుస్తాడు. అలాగే ప్రియురాలు కూడా ప్రియుడు ఏదో ఒకటి తనకి గిఫ్ట్ ఇస్తూ ఉండాలని కోరుకుంటుంది..

ఫోన్ ఇవ్వలేదని ప్రియుడుని పదిమందిలో అందరి ముందు -China Girl Slapped Her Boyfriend 52 Times

మన ఇండియాలో అయితే బాయ్ ఫ్రెండ్ దొరికడమే ఆలస్యం అన్నట్లు అతన్ని బ్యాంకు బ్యాలెన్స్ ని ఎంత వేగంగా ఖాళీ చేసేద్దామా అని చూసే ప్రియురాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే తాజాగా లవర్స్‌డే నాడు తన ప్రేయసికి ఓ ప్రేమికుడు గిఫ్ట్ తీసుకెళ్లడం మరిచిపోయాడు. దాంతో ఆ ప్రియురాలు అందరూ చూస్తుండగానే ప్రియుడి చెంప చెల్లు మనిపించింది.

ఏకంగా అతనిని 52 చెంప దెబ్బలు కొట్టి కోపం తీర్చుకుంది.

చైనాలో ఈ నెల 20 ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఈ స్పెషల్ డే రోజు చాలా మంది ప్రేమికులు తమ ప్రియురాళ్ళకి గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు. అలాగే తన ప్రియుడు గిఫ్ట్ తీసుకొస్తాడని ఎదురుచూసిన ప్రియురాలికి అతను ఉత్తి చేతులతో రావడం కనిపించి కోపం కట్టలు తెచ్చుకుంది. దీంతో అందరి మధ్యలో ప్రియుడుని ఇష్టం వచ్చినట్లు కొట్టింది.

దీనికి సంబంధించిన వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది.ప్రియురాలు కొడుతున్న ప్రియుడు అక్కడి నుంచి కదలకుండా అలాగే నిలబడి ఉండడం ఈ వీడియోలో రికార్డు అయింది. ప్రియురాలు గత కొంతకాలంగా ప్రియుడికి ఆర్థికంగా సాయం చేసిన కూడా ప్రేమికుల రోజు తన కోసం ప్రియుడు కనీసం ఓ ఫోన్ కూడా కొనివ్వకపోవడంతో కోపంతో అతడిపై చేయి చేసుకుందని సమాచారం