యాజమాన్యం అంటే అలా ఉండాలి ... ఉద్యోగులకు బోనస్ గా డబ్బు గుట్టలు!

ఉద్యోగులతో పనిచేయించుకోవడమే కాదు… వారి కనీస అవసరాలు తీరుస్తూ… వారిని కంటికి పాపలా చేసుకుంటేనే ఆ ఉద్యోగులకు కూడా సంస్థపై గౌరవం పెరుగుతుంది.సాధారణంగా ప్రతి కంపెనీ పండుగ లేక కంపెనీ వార్షికోత్సవాలు సమయంలో బోనస్ లు ప్రకటిస్తూ ఉంటాయి.అంటే వారికి ఒక నెల జీతమో లేక అంతకంటే కొంచెం స్వల్ప మొత్తం ఎక్కువగానో ఇస్తూ ఉంటాయి.అయితే…అందరిలా తాము కూడా ఇస్తే మా కంపెనీ స్పెషలిటీ ఉంటుంది అనుకుందో ఏమో కానీ ఓ కంపెనీ ఏకంగా… పెద్ద మొత్తంలో ఉద్యోగులకు బోనస్ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

 China Firm Makes Money Mountain To Distribute New Year Bonus For Employees-TeluguStop.com

ఇటీవల సూరజ్‌ పట్టణంలో ఓ వజ్రాల వ్యాపారి దీపావళి పండుగ పురస్కరించుకుని సీనియర్‌ ఉద్యోగులకు 5 వేల కార్లు, మిగతా ఉద్యోగులకు నగదును బోనస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ చైనాలోని ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు రూ.62 లక్షలు బోనస్‌ గా ప్రకటించింది.వివరాలు పరిశీలిస్తే… చైనాలోని నాన్‌చాంగ్ నగరంలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు 300 మిలియన్ యువాన్ల (దాదాపు రూ.34 కోట్లు)ను ప్రకటించింది.చైనాలో ప్రతి న్యూఇయర్‌ ఫెస్టివల్‌( దీని మరో పేరు ‘స్ప్రింగ్‌ ఫెస్టివల్‌’) కి ఆ కంపెనీ బోనస్‌ ను ప్రకటిస్తుంది.

అలా ఆ మొత్తం 300 మిలియన్ల యువాన్లను ఆ కంపెనీకి సంబంధించిన కార్యాలయంలో గుట్టలుగా పేర్చారు.ఈ కంపెనీలో మొత్తం 5 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.వారిలో ఒక్కరొక్కరికి 60 వేల యువాన్లు(రూ.62 లక్షలు) బోనస్‌ గా అందజేసింది.గుట్టలుగా ఉన్న యువాన్ల మధ్య కంపెనీ ఉద్యోగులు సంబరంతో ఫొటోలు తీసుకున్నారు.మాకు ప్రతి యేడు బోనస్‌ ఇస్తారు కానీ ఈసారి ఇంత మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావడం లేదని ఉద్యోగి మీడియాకు చెప్తూ ఆనందభాష్పాలు కార్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube