వామ్మో.. ఏకంగా భూమిపై మరొక చంద్రుడిని సృష్టించిన చైనా..!

ఖగోళ శాస్త్రం గురించి ఎన్ని పరిశోధనలు చేసినా గాని అంతు చిక్కని ప్రశ్నలు కోకొల్లలు ఉంటాయి.ఆకాశంలో ఉండే చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇలా అన్ని కూడా భలే విచిత్రంగా ఉంటాయి.

 China Created Another Moon On Earth Simultaneously. Moon,earth, China, Latest N-TeluguStop.com

పగటి పూట సూర్యడు రావడం, సాయంత్రం పూట చంద్రుడు రావడం లాంటి విషయాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి.ఒక విధంగా చెప్పాలంటే సూర్యచంద్రులు లేనిదే మనకు రోజే లేదు.

అయితే చంద్రుడు ఎక్కడ ఉంటాడు అని చిన్నపిల్లాడిని అడిగానా సరే ఆకాశంలో ఉంటాడు అని ఇట్టే చెప్పేస్తాడు.కాని అంతరిక్ష విజ్ఞానంలో ఎన్నో విజయాలు సాధించిన చైనా మాత్రం భూమిపై కృత్రిమ చంద్రుడిని నిర్మించి అందరి దృష్టిని.

తనవైపు తిప్పుకుంది.ఈ మాదిరి చంద్రుడి సృష్టి జరగడం ఇదే మొదటిసారి అవ్వడం గమనార్హం.

ఈ చంద్రుడు తక్కువ గురుత్వాకర్షణ పరిస్థితులను అనుకరిస్తుంది అలాగే భవిష్యత్‌లో చంద్రుడిపై చైనా తలపెట్టే ప్రయోగాల్లో ఈ చంద్రుడు ప్రత్యేక పాత్రను పోషిస్తాడనే చెప్పాలి.మరి కొన్ని నెలల్లో అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చైనా యూనివర్సిటీ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్త లి రుయిలిన్ తెలిపారు.

ఈ కృత్రిమ చంద్రుడి ప్రాజెక్టును తూర్పు నగరం జుఝోలో చేపటనున్నారు.ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ఎన్నో రకాల సాంకేతిక ఆవిష్కరణలు అవసరమయ్యాయని లీ వెల్లడించారు.

చంద్రుడిలో ఉండే తరహా వాతావరణం భూమి మీద సృష్టించేందుకు ఏర్పాటు చేసిన అయస్కాంత శక్తులు ఎంతో బలమైనవి అని ఆయన తెలిపారు.ఈ ప్రయోగం చేయడం ఆండ్రీ గేయిన్ స్ఫూర్తి ఉందని తెలిపారు.

అయస్కాంతంతో కప్పను గాల్లోకి లేపిన ఆండ్రి గెయిన్ ప్రయోగాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కేంద్రాన్ని రూపొందించామని తెలిపారు.

Telugu China, Earth, Latest, Moon-Latest News - Telugu

ఒక వ్యాక్యూమ్‌ ఛాంబర్‌లో రెండు అడుగులు డయామీటర్‌తో కూడిన ఒక చంద్రుడి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.ఎలా అయితే చంద్రుడిపై రాళ్లు, దుమ్ము ఉంటాయో అదే తరహాలోనే ఈ కృత్రిమ చంద్రుడిని కూడా రాళ్లు, ధూళితో రూపొందించారు.అలాగే ల్యాండ్‌స్కేప్‌ కు చంద్రుడి తరహాలో ఆయస్కాంత క్షేత్రం ఆధారంగా ఉంటుందని,అందులో గురుత్వాకర్షణ శక్తి అనేది భూమిపై ఉండే మాదిరిగానే ఆరవ వంతు ఉంటుందని.

లీ చెప్పుకొచ్చారు.ఆ గురూత్వాకర్షణ శక్తి అనేది ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ తేలికపాటి వస్తువులు గాల్లోకి కూడా ఎగురుతూ ఉంటాయట.చంద్రుడిపై చైనా దేశం చేపట్టబోయే ప్రయోగాల్లో ఈ ప్రాజెక్టు ప్రముఖ పాత్ర పోషించగలదని లీ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube