నమ్మలేని నిజం: 2019 లో కాదు,2012 లోనే ఈ మహమ్మారి!

ప్రపంచ దేశాలకు సంబంధించి కరోనా మహమ్మారి 2019 లో చైనా లోని వూహన్ లో పురుడుపోసుకుంది అని అందరూ భావిస్తున్నారు.అయితే, వుహాన్ నగరంలో ఈ వైరస్ ఎలా వచ్చింది? అనే దానిపై ఇప్పటికే అనేక కథనాలు, అనుమానాలు ఉన్నాయి.ప్రపంచంలో భయోత్పాతాన్ని కలిగించేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు అంటే, మరికొందరు మాత్రం, సహజంగా ఇది గబ్బిలాల నుంచి వచ్చిన వైరస్ అని అంటున్నారు.అయితే ఈ కరోనా మహమ్మారి గురించి నమ్మలేని నిజం ఒకటి బయటపడింది.ఈ మహమ్మారి 2019 లో కాదు 2012 లోనే కరోనా పురుడుపోసుకుంది అంటూ ఒక వార్త హల్ చల్ చేస్తుంది.2012లోనే వైరస్ కు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.కానీ, అప్పట్లో అది కరోనా వైరస్ అని గుర్తించలేకపోవడం తో పాటు దాని తీవ్రత కూడా పెద్దగా కనిపించలేదు.2012 వ సంవత్సరంలో నైరుతి చైనాలో ఓ రాగి గని ఉన్నది.దానిని మూసేసి చాలా కాలం అయ్యింది.చీకటిగా ఉన్న ప్రాంతం కావడంతో సహజంగానే గబ్బిలాలు అధికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.ఎలుకలు వంటివి ఎక్కువగా లోపల తిరుగుతుంటాయి.అయితే, గని తెరిచి ఉన్న సమయంలో చాలామంది కార్మికులు తెలియని రోగంతో మరణిస్తుండేవారు.

 Seven Year Coronavirus Trail From Mine Deaths To A Wuhan Lab, China, Coronavirus-TeluguStop.com

అయితే ఆ రోజు ఎందుకు అలా జరిగిందో ఎవరికీ తెలియదు.గని మూసేసిన తరువాత కూడా కొంతమంది కార్మికులు లోపలికి వెళ్లి న్యూమోనియా వ్యాధితో మరణించారు.

దీంతో ఆ గనిలో ఏమున్నదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు గనిలోకి ప్రవేశించారు.గనిలో బండరాళ్లను పక్కకు జరిపి అక్కడి నుంచి అనేక నమూనాలను సేకరించారు.2012 నుంచి ఆ గని నుంచి వేలాది శాంపిల్స్ ను సేకరించి వుహాన్ లోని ల్యాబ్ కు తరలించారు.

అప్పటి శాంపిల్స్ లోనే కరోనా వైరస్ కు సంబంధించిన విషయాలు బయటపడ్డాయని టైమ్స్ యూకే బయటపెట్టింది.

మరి అక్కడ నుంచి ఈ వైరస్ ప్రజల్లోకి ఎలా స్ప్రెడ్ అయ్యింది అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.నిజంగానే ఇది అనుకోకుండా జరిగిన పరిణామమా లేదంటే కొంతమంది అంటున్నట్లు భయోత్పాతాన్ని కలిగించేందుకు చేసిన ఎత్తుగడ అన్నది మాత్రం అర్ధంకావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube