ఇంత జరుగుతున్న మారని చైనా,డాగ్-మీట్ ఫెస్టివల్ కి రెడీ!

చైనీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుంటే వారు తినే తిండి మనుషులు ఎవరూ తినరేమో అన్న అనుమానాలు కూడా రాకమానవు.ఇటీవల ఈ చైనా ఆహారపు అలవాట్ల వల్లే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కి లక్షల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.

 Yulin Dog Meat Festival In Corona Time , China Coronavirus, Dog Meet Festival, L-TeluguStop.com

రకరకాల జంవుతులు,పక్షులు,గబ్బిలాలు వంటి ఇలా తినడం వలనే చైనా లో మొదలెత్తుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంది.చైనా లోని ఈ వైరస్ అనేది మొదలైంది అని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.

అయితే ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కోవిడ్ వల్ల మృతి చెందుతున్నప్పటికీ డ్రాగన్ దేశంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.ఇంకా ఈ వైరస్ నుంచి పూర్తిగా బయటపడకుండానే డాగ్-మీట్ ఫెస్టివల్ కు సిద్ధమౌతున్నారు.

కోవిడ్ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ ఏడాది డాగ్-మీట్ ఫెస్టివల్ నిర్వహించడంపై విముఖత చూపినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం వినడం లేదు.ముఖ్యంగా మెయిన్ ల్యాండ్ చైనాలోని యులిన్ నగర ప్రజలు ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా డాగ్‌-మీట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.

ఈ ఏడాది చైనా 10 రోజుల వార్షిక వేడుకలు జరుపుతున్నారు.ఇందులో భాగంగా దేశంలోని వేల కుక్కలను చంపేస్తున్నారు.

ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తో అల్లాడిపోతుంటే చైనా ప్రజలు మాత్రం ఈ ఫెస్టివల్ మాత్రం జరుపుకోవాల్సిందే అంటుండడం గమనార్హం.గతేడాది ఆగష్టు లోనే చైనా లో ఈ కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటికీ నవంబర్,డిసెంబర్ నెలల్లో ఉగ్రరూపం దాల్చింది.

దీనితో 75 రోజుల పాటు లాక్ డౌన్ విధించి పూర్తి స్థాయిలో ఈ వైరస్ ను నియంత్రించ గలిగారు.అయితే పూర్తి స్థాయి లో కరోనా నిర్మూలించాము అని భావించిన చైనా లో ఇటీవల మరోసారి కరోనా కేసులు బయటపడుతున్నాయి.

అయితే ఇంతగా పరిస్థితులు ఏర్పడినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ఈ డాగ్-మీట్ ఉత్సవాలు మాత్రం జరిపితీరాల్సిందే అని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube