చైనీయులకు భోజనం పెట్టం.. ఆ ప్రాంతంలో సంచలన నిర్ణయం..?

భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఏకంగా భారత సైన్యానికి చెందిన ఒక కల్నల్.ఇరవై మంది సైనికులు అమరులవ్వటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

 Do Not Give Meals To Chinese .. Sensational Decision In The Area China, Boycot C-TeluguStop.com

ఈ నేపథ్యంలో బాయికాట్ చైనా అనే ఒక నినాదం తెరమీదికి వచ్చింది.అయితే ఇప్పటికి ఎంతో మంది చైనా వస్తువులను కొనుగోలు ఆపడంతో పాటు ఉన్న వస్తువులను కూడా ధ్వంసం చేసిన ఘటనలు మనం చూశాం.

ఇక బాయ్ కాట్ చైనా అనే నినాదం రోజురోజుకి మరింత రగులుతూనే ఉంది.తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు చైనా ఉత్పత్తులను బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా చైనీయులకు తమ హోటళ్లలో గదులు అద్దెకు ఇవ్వబోము అంటూ తెలిపారు.ఈ మేరకు ఢిల్లీ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఒక బహిరంగ లేఖ రాసింది.

ఈ సంఘంలో ఏకంగా మూడు వేలకు పైగా హోటళ్లు రెస్టారెంట్లు సభ్యత్వం కలిగి ఉండటం గమనార్హం.

అయితే బాయికాట్ చైనా నినాదానికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది ఈ హోటల్ రెస్టారెంట్ సంఘం.

చైనీయులకు సంబంధించి ఎలాంటి బుకింగ్లు తీసుకోబోమని ఎలాంటి సర్వీసులు అందించబోమని అంటూ వెల్లడించారు.అంతేకాకుండా తమ హోటల్లో చైనా కు సంబంధించిన అన్ని రకాల వస్తువులను కూడా బహిష్కరిస్తామని తెలిపారు.

ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో బైకాట్ చైనా నినాదం మరింత పుంజుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube