బీబీసీ ని బ్యాన్ చేసిన చైనా..!

చైనా దేశం లో ‘బీబీసీ వరల్డ్ న్యూస్‘ ప్రసారాలను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది.ఫిబ్రవరి 4వ తేదీన చైనా దేశానికి చెందిన ‘సీజిటీఎన్‘ (CGTN- చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్) అనే అంతర్జాతీయ ఇంగ్లీష్ ఛానల్ యొక్క బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ లైసెన్స్ రద్దు చేయబడింది.

 China Bans Bbc, Bbc, Banned, Channel, China, Viral Latest, Viral News, Bitish Co-TeluguStop.com

సీజిటీఎన్ ఛానల్ చైనా అధికార కమ్యూనిస్టు పార్టీకి మద్దతుగా వార్తలను ప్రసారం చేస్తోందని చెబుతూ బ్రిటన్స్ కమ్యూనికేషన్ వాచ్ డాగ్ ఆఫ్ కామ్(Ofcom) ఆ ఛానల్ యొక్క ప్రసారాల పై నిషేధం విధించింది.

దీంతో చైనా ప్రభుత్వం ప్రతీకారేచ్ఛతో బీబీసీ వరల్డ్ న్యూస్ ని తమ దేశంలో బ్యాన్ చేస్తామని బెదిరించింది.

వెంటనే తమ దేశానికి చెందిన సీజిటీఎన్ ఛానల్ ప్రసారాలకు లైసెన్స్ ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చింది.కానీ సీజిటీఎన్ ఛానల్ కు లైసెన్స్ లభించలేదు.దీంతో చిర్రెత్తుకొచ్చిన చైనా ప్రభుత్వం బ్రిటన్ కి చెందిన బీబీసీ వరల్డ్ న్యూస్ పై కొరడా ఝుళిపించింది.

Telugu Bitish, Channel, China, Covid, False, Latest-Latest News - Telugu

చైనా దేశానికి సంబంధించిన వార్తలను కవరేజ్ చేయడం లో బీబీసీ వరల్డ్ న్యూస్ తమ నిబంధనలను అతిక్రమించిందని చైనీస్ నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ శాఖ శుక్రవారం రోజు ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది.చైనా లో కొవిడ్ – 19 మహమ్మారిపై బీబీసీ వరల్డ్ న్యూస్ తప్పుడు కథనాలను ప్రసారం చేసిందని అక్కడి ప్రభుత్వం ఆరోపించింది.జిన్ జియాంగ్ లో బలవంతంగా బాలబాలికలను కార్మికులుగా మారుస్తున్నారని కూడా తప్పుడు కథనాలు ప్రచురించిందని.

జిన్ జియాంగ్ లో లైంగిక దాడులు కూడా ఎక్కువగా జరుగుతున్నట్టు బీబీసీ ఫేక్ న్యూస్ ప్రసారం చేసిందని.అందుకే బీబీసీ వరల్డ్ న్యూస్ పై బ్యాన్ విధిస్తున్నామని చైనా ప్రభుత్వం వెల్లడించింది.

దీంతో యూకే విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ మాట్లాడుతూ “మీడియా స్వేచ్ఛకు ఆమోదయోగ్యంకాని పద్ధతిలోని భంగం కలిగిస్తున్నారు.ఇది ప్రపంచ దృష్టిలో చైనా ప్రతిష్టను దెబ్బతీస్తుంది’ అని మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube