యాపిల్ యాప్ స్టోర్ నుంచి చైనా యాప్స్ తొలగింపు..!  

china apps removal from apple app store China Apps, Removal, Apple App Store - Telugu Apple App Store, China Apps, Removal

కరోనా కారణంగా చైనాకు అన్ని దేశాలు శత్రువులుగా మారిన పరిస్థితి.ఇప్పటికే చాలా దేశాలు చైనాకు సంబంధించిన ఉత్పత్తులు, యాప్స్ లను నిషేధిస్తున్నారు.

 China Apps Removal Apple App Store

యాప్స్ లను బ్యాన్ చేయడం కొనసాగుతూనే ఉంది.భారత్ కూడా సరిహద్దు వివాదం వల్ల ఈ ఏడాది చైనా యాప్ లను నిషేధించింది.

ప్రజలందరూ చైనా యాప్ లను అన్ ఇన్ స్టాల్ చేసి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు.తాజాగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ చైనాకు సంబంధించిన యాప్ లను తన యాప్ స్టోర్ నుంచి తొలగించింది.

యాపిల్ యాప్ స్టోర్ నుంచి చైనా యాప్స్ తొలగింపు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి ఏకంగా 29,800 చైనా యాప్స్ లను తొలగించింది.ఈ యాప్స్ లలో ఎక్కువగా గేమింగ్ కి సంబంధించిన వాటినే తొలగించింది.29,800 యాప్ లలో 26 వేలకు పైగా గేమ్ యాప్స్ ఉన్నాయి.అయితే, గేమ్ యాప్స్ తొలగించడానికి కారణం.

యాప్స్ కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సులు సమర్పించాలని గతేడాది యాపిల్ సంస్థ ప్రకటించింది.లైసెన్స్ సమర్పించని యాప్స్ పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

లైసెన్సులు ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది.సెక్యూరిటీ, సైబర్ దాడులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

#Apple App Store #China Apps #Removal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

China Apps Removal Apple App Store Related Telugu News,Photos/Pics,Images..