భారత్ మీద కుట్ర పన్నుతున్న పాకిస్తాన్, చైనా

నానాటికీ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంటూ, చిన్న దేశాలకు అణు పరికరాలను, పరిజ్ఞానాన్ని అందించాలని భావిస్తున్న ఇండియా ఆలోచనలకు గండి కొట్టాలని పాక్, చైనాలు కుయుక్తులు పన్నుతున్నాయి.

 China And Pakistan Trying To Block India’s Entry Into Nsg-TeluguStop.com

భారత్ ను ఎన్ఎస్జీ (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)లోకి ప్రవేశించనీయకుండా రెండు పొరుగు దేశాలూ అడ్డంకులు పెడుతున్నాయి.

పాక్ ను అడ్డుపెట్టుకుని చైనా ఈ ప్లాన్ వేస్తోంది.పాక్ పరిస్థితులు, అక్కడి ఉగ్రవాద కార్యకలాపాలను సాకుగా చూపుతూ, పాక్, భారత్ ల రెండింటికీ ఎన్ఎస్జీలో ప్రవేశానికి తాము అంగీకరించబోమని చెబుతోంది.

అయితే, కేవలం చైనా అభ్యర్థనలను ఆధారంగా చేసుకుని ఇండియాను అడ్డుకోబోమని అమెరికా చెబుతున్నప్పటికీ, ఐరాసలో శాశ్వత సభ్యత్వమున్న చైనా అడ్డంకేనని నిపుణులు వ్యాఖ్యానించారు.కాగా, గత నెల 25 నుంచి రెండు రోజుల పాటు జరిగిన ఎన్ఎస్జీ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశాల్లో, తమ ప్రవేశానికి ఇండియా దరఖాస్తు చేయగా, పాక్ సైతం ఇదే దరఖాస్తు చేసుకుంది.

ఇప్పుడు పాక్ ను సాకుగా చూపుతున్న చైనా, ఇండియానూ నిలువరించాలని పన్నాగాలు పన్నుతోంది.చైనా సలహామీదే పాక్ కూడా తమను ఎన్ఎస్జీలో చేర్చాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube