మనిషిని ఆప్యాయంగా కౌగిలించుకున్న చింపాంజీ.. అసలు మ్యాటరెంటంటే..?

మనకు ఎంతోమంది ఆత్మీయులు, స్నేహితులు ఉండవచ్చు.కానీ కష్టాల్లో ఉన్నప్పుడు లేదంటే ఎదన్న ఆపదలో ఉన్నప్పుడు ఆడుకున్న వారే నిజమైన శ్రేయోభిలాషులు.

 Chimpanzee Hugging Man Affectionately What Is The Real Matter, Chimpanzee, Hugs,-TeluguStop.com

మనకి మంచి చేసి, ఆపదలో ఉన్న మనల్ని కాపాడిన వారిని ఎట్టి పరిస్థితులలో మరువకూడదు.మనల్ని ఆపద నుంచి కాపాడిన వరకు ధన్యవాదాలు చెప్పుకుంటాము కదా.అయితే కేవలం మనుషులలో మాత్రమే ఈ కృతజ్ఞతా భావం ఉంటుంది అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే నోరు లేని మూగ జీవాలు కూడా తమని ఆపదల నుంచి కాపాడినప్పుడు వారి పట్ల ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటాయి అనడానికి ఈ చింపాంజీ ఒక ఉదాహరణ అని చెప్పాలి.

ప్రస్తుతం చింపాంజీ, మనుషుల మధ్య జరిగిన ఈ భావోద్వేగ ఘటన చుసిన అందరి చేత ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.

ఓ చింపాంజీ తనను కాపాడినవారిని కౌగలించుకుని మరి ఎంతో ఎమోషనల్ అయ్యి వారికి ధన్యవాదాలు తెలిపిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేయగా.అది కాస్త బాగా వైరల్ అయింది.

అడవిలో ఉండే చింపాంజీని పట్టుకోవాలని భావించి కొంతమంది వేటగాళ్లు దానికి ఒక ఉచ్చు పన్నారు.అది తెలియని చింపాంజీ ఆ బోనులో ఇరుక్కుపోయింది.

దానిని గమనించిన జంతు సంక్షేమం గురించి అధ్యయనాలు చేసే పటాలజిస్ట్ జేన్ గూడాల్‌ బృందం వెంటనే చింపాంజీని బోను నుంచి బయటకి తీశారు.దాన్ని బోనునుంచి విడుదల చేయగానే వెళ్లిపోతున్న చింపాంజీని గూడాల్‌ బృందంలోని ఓ మహిళ హాయ్ అంటూ దాన్ని పలుకరించింది.

ఆ పిలుపు విన్న చింపాంజీ భావోద్వేగానికి గురై ఆమె దగ్గరకొచ్చి ఆమె ఒడిలో కూర్చుని కృతజ్ఞతలు తెలిపింది.ఆ తరువాత బోను పైకి ఎక్కి తనను కాపాడిన జేన్ గూడాల్ ను కౌగలించుకుని భావోద్వేగానికి గురైంది.ఆమెను గట్టిగా హత్తుకుని ధన్యవాదములు తెలిపింది.జేన్ కూడా చింపాంజీని హత్తుకుని దాని వెన్నుని చేతితో నిమిరారు.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇకపోతే జేన్ గూడాల్ విషయానికి వస్తే 87 సంవత్సారాల పాటు చింపాంజీలపై అధ్యయం చేశారు.

చింపాంజీల పరిరక్షణ కోసం, జంతు సంక్షేమం కోసం ఆమె ఎంతగానో తాపత్రయ పడతారు అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube