సింహం పిల్లలకు పెంపుడు తల్లి గా మారిన చింపాంజీ..

ఎవరికైనా తల్లిని మించిన దైవం లేదు.తల్లి ప్రేమకు హద్దులు పరిమితులు ఉండవు.

 Chimpanzee Feeds Lion Cub, Chimpanzee, Lion Cub, Viral Post Susanta Nanda, Twit-TeluguStop.com

జాతి ఏదైనా సరే… తల్లి ప్రేమ తల్లికి అంకితం.ప్రస్తుత సమాజంలో అన్ని జంతువులను చంపి తినే సింహాలు అంటే చాలామందికి భయమే.

సింహాలకు ఏదైనా హాని జరిగినా కూడా ఏమీ అవదని అందరూ అనుకుంటాం.కానీ, అలాంటి తల్లికి దూరమైన ఒక సింహం పిల్లను ఓ చింపాంజీ దగ్గరకు తీసుకొని చేరదీసింది.

నిజానికి ఈ రెండిటికీ ఎలాంటి సంబంధం లేదు.

ఆకలితో ఉన్న సింహం పిల్లలు ఆడుకోవడానికి బంధమే అవసరమా…? మనసు ఉంటే సరిపోతుందని అనుకుందేమో చింపాంజీ, పాల డబ్బాతో సింహం పిల్లకు పాలు పట్టింది.ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుంసంత్ నంద సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.ఈ షేర్ చేసిన వీడియోలలో చింపాంజీ సింహం పిల్లకు పాలు పట్టిస్తూనే, మరో వైపు తల నిమురుతూ నుదుటి మీద సింహం పిల్లలకు ముద్దు పెట్టుకోవడం వంటివి వీడియోలు గమనించవచ్చు.

ఇక ఈ వీడియోకు చివర్లో పెంపుడు తల్లి ముద్దు అనే టైటిల్ తో సుశాంత్ నంద ట్విటర్లో షేర్ చేశారు.సోషల్ మీడియాలో ఈ వీడియోలు దాదాపు లక్ష మందికి పైగా వీక్షించారు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తల్లి ప్రేమను వెలకట్టలేం అంటూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.నిజంగా తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube