కల్లు తాగిన కోతిలా ఎగిరెగిరి తన్నిన చింపాంజీ  

Chimpanzee Escape To Zoo-

జూ లో కొన్ని కొన్ని సార్లు జంతువులూ అదుపుతప్పుతూ ఉంటాయి.ఈ క్రమంలో కొన్ని సార్లు విజిటర్స్ పై కూడా దాడికి పాల్పడిన ఘటనలు చాలానే చూసి ఉంటారు.అయితే చైనా లో కూడా హైఫై వైల్డ్ లైఫ్ పార్కు లో ఒక చింపాంజీ కల్లు తాగిన కోతిలా గంతులు వేసింది...

Chimpanzee Escape To Zoo--Chimpanzee Escape To Zoo-

12 ఏళ్ల వయసు గల యాంగ్ యాంగ్ అనే చింపాంజీ హైఫై వైల్డ్ లైఫ్ పార్క్ లో ఉంటుంది.అయితే బోను లో నుంచి తప్పించుకున్న ఆ చింపాంజీ ఒక్కసారిగా పరుగు లంకించుకుంటూ గేటు వద్దకు వచ్చింది.

Chimpanzee Escape To Zoo--Chimpanzee Escape To Zoo-

దీనితో జూ కీపర్ దానిని అదుపుచేద్దాం అని ప్రయత్నించగా,దానికి ఆ చింపాంజీ మరింత రెచ్చిపోయి ఆ జూకీపర్ ను ఎగిరి మరి తన్నింది.నిజంగా దాని తన్నుడు చూస్తే మాత్రం అది చింపాంజీ కాదు మనిషే అన్నట్లుగా ఎగిరెగిరి తన్నింది.అంతేకాకుండా విజిటర్ల పై కూడా దాడి చేయబోవడం తో అందరూ కూడా భయంతో చెల్లా చెదురుగా పరుగులు తీశారు.

ఈ క్రమంలో ఒక విజిటర్ మాత్రం దాడికి గురైనట్లు తెలుస్తుంది.అనంతరం అందర్నీ హడలెత్తించిన చింపాంజీ అనంతరం ఒక చెట్టు పైకి వెళ్లి కూర్చుంది..

అయితే వెంటనే జూ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడం తో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రాంక్వి లైజర్ ప్రయోగించి మొత్తానికి దాన్ని అదుపు చేయగలిగారు.మళ్ళీ జూలోకి చేర్చారు.

చైనా లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ అవ్వడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ వీడియో ను చూసిన నెటిజన్లు అబ్బో అని అనుకుంటున్నారు.