‘‘అమ్మా.. భయంగా వుంది’’ : టెక్సాస్ స్కూల్‌ కాల్పుల సమయంలో తల్లితో ఓ విద్యార్ధి ఛాటింగ్

ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు ఎంతగా ప్రచారం చేస్తున్నా అమెరికాలో గన్ కల్చర్ మాత్రం మారడం లేదు.సంతలో కూరగాయలు కొన్నట్లు తుపాకీలు చాలా సులభంగా దొరుకుతుండటంతో అవి ఉన్మాదుల చేతుల్లో పడి అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.

 Chilling Texts From Boy During Texas School Shooting Go Viral , Dallas, Texas, T-TeluguStop.com

తాజాగా నాలుగు రోజుల క్రితం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరానికి సమీపంలోని అర్లింగ్టన్‌లో వున్న టింబర్ వ్యూ పాఠశాలలో ఓ విద్యార్ధి తరగతి గదిలోనే తోటి విద్యార్ధులపై కాల్పులకు తెగబడిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.

విద్యార్ధుల మధ్య తలెత్తిన ఘర్షణ కారణంగానే కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు తెగబడిన విద్యార్ధి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు.

ఈ పాఠశాలలో మొత్తం 1,800 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.కాల్పుల విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.

అయితే కాల్పుల ఘటనతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఓ విద్యార్ధి జరిగిన సంఘటనను కళ్లకు కట్టినట్లు చెప్పాడు.కాల్పుల సమయంలో ఓ విద్యార్ధి తన తల్లితో ఫోన్ ద్వారా అక్కడి పరిస్ధితిని వివరించాడు.

ఈ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సదరు పిక్స్‌లో ‘‘ అమ్మా.

ఇక్కడ కాల్పులు జరుగుతున్నాయి.చాలా భయంగా వుంది, కాపాడు అంటూ మెసేజ్ పెట్టాడు.దీనికి తల్లి… నువ్వు సేఫ్‌గా వున్నావా అని అడగ్గా.నాకు తెలియదు అమ్మా అని రిప్లయ్ ఇచ్చాడు.ఈ స్క్రీన్ షాట్లను ఓ పాత్రికేయుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ కొద్దిసేపట్లోనే ఇది వైరల్‌గా మారింది.

ఈ ట్వీట్‌కు 60,000 కంటే ఎక్కువ లైక్‌లతో నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు.

బిడ్డ నుంచి కాపాడాలంటూ మెసేజ్ వచ్చినప్పటికీ కాపాడుకోలేని స్ధితిలో వున్న తల్లి బాధ వర్ణనాతీతమంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో తుపాకీ చట్టాలను పునర్వ్యస్థీకరించాలని మరో యూజర్ డిమాండ్ చేశారు.అమెరికన్ పొలిటికల్ జర్నలిస్ట్ మెహదీ హసన్ సైతం గన్ కంట్రోల్‌పై స్పందించారు.దేశంలో అత్యధికులు తుపాకీ నియంత్రణను కోరుకుంటున్నారని.కానీ కొంతమంది లాబీయిస్టులు మాత్రం దీనిని ఒప్పుకోరని ఆష్లే ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube