చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్న కరోనా.. సెకండ్ వేవ్‌తో జాగ్రత్త.. !

ప్రస్తుతం దేశంలో కరోనా తన దిశను మార్చుకుందట.గత సంవత్సరం పెద్దవారికి ప్రాణసంకటంగా మారిన కోవిడ్ ఈ సంవత్సరం మాత్రం సెకండ్ వేవ్‌గా రిలీజ్ అయ్యి చిన్నారులపై విపరీతంగా ప్రభావం చూపిస్తుందట.

 Second Wave Of Corona Endangering The Lives Of Children In India-TeluguStop.com

ఇక ఐదు రాష్ట్రాల్లోని 79,688 మంది చిన్నారులు మార్చి నుండి ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డారని, తొలి దశలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని మాత్రమే బలిగొన్న కరోనా మహమ్మారి, ఇప్పుడు అన్ని వయసుల వారినీ బాధిస్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు.ఇదిలావుండగా ఛత్తీస్ గఢ్ లో 6,940 మంది చిన్నారులకు వ్యాధి సోకగా, వారిలో 922 మంది ఐదేళ్లలోపు వారే ఉన్నారట.

అదీగాక ఇండియాలో మార్చి 1 నుంచి ఏప్రిల్ నాలుగు మధ్య 60,684 మంది చిన్నారులు కరోనా బారిన పడగా, వారిలో 9,882 మంది ఐదేళ్లలోపు చిన్నారులు కావడం గమనార్హం.ఇక దేశ రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొని వుందట, ఈ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, యూపీల్లో సైతం దాదాపు 1200 మందికి పైగా ఐదేళ్లలోపు పిల్లలు కరోనా బారిన పడ్డారని వైద్యులు తెలియచేస్తున్నారు.

 Second Wave Of Corona Endangering The Lives Of Children In India-చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్న కరోనా.. సెకండ్ వేవ్‌తో జాగ్రత్త.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా చిన్నపిల్లలకు ప్రస్తుతం కోవిడ్ టీకా అందుబాటులో లేకపోవడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తుందని తెలుస్తుంది.కాబట్టి చిన్నారుల విషయంలో తగినంతగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం.

#Childrens #Corona Virus #Second Wave #Beware #More Powerful

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు