తల్లిదండ్రులు రోజూ గొడవ పడుతున్నారని ఆ ఇద్దరు పిల్లలు ఏం చేశారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. దెబ్బకు గొడవ మానేశారు

ఇంట్లో ప్రశాంతత అనేది లేకుంటే ఎంతటి నరకంగా ఉంటుందో కొందరికి మాత్రమే తెలుసు.ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే ఆ ఇంట్లో ఉండే పిల్లలు ఎంతటి నరకయాతన అనుభవిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Children Said We Dont Want This Type Of Parents-TeluguStop.com

అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న కుటుంబంలో పిల్లలు ఉండేందుకు కూడా ఇష్టపడరు.అమెరికా ఇండియానాకు చెందిన భార్య భర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండటం వల్ల వారి పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు.

చివరకు వారు చేసిన పనికి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుని కలిసి ఉండేందుకు, గొడవ పడకుండా ఉండేందుకు ఒప్పుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇండియానాలో నివాసం ఉండే జాక్‌ మరియు డైసీలకు పదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది.

వీరికి ఇద్దరు పిల్లలు.పాపకు ఎనిమిది ఏళ్లు కాగా, బాబుకు ఆరు ఏళ్లు.

ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవ్వడంతో వారు ఎప్పుడు సంతోషంగా ఉండటం కోరుకుంటారు.ఎందుకంటే తెలిసి తెలియని వయసు, వారు అన్ని విషయాల్లో కూడా హ్యాపీగా ఉండాలనే కోరుకునే తత్వం.

పిల్లలు అంటేనే ఎక్కడైనా, ఏదైనా సంతోషం ఇచ్చేదాన్ని కోరుకుంటారు.ఇక జాక్‌ మరియు డైసీలు ఎప్పుడు గొడవ పడుతూ, కొట్టుకుంటూ ఉండటం వల్ల ఆ పిల్లల మనసు బాగా నొచ్చుకుంది.

ప్రతి రోజు ఏదో ఒక విషయంలో అరుచుకుంటూ పిల్లలను పట్టించుకునే వారు కాదు.దాంతో ఆ పిల్లలు ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు.

పక్క ఇంట్లో వారి వద్దకు వెళ్లి మాకు మా అమ్మా నాన్న వద్దు, మేము మీతో కలిసి ఉంటాం అన్నారట.అవాక్కయిన వారికి పరిస్థితి అర్థం అయ్యింది.

దయచేసి మా ఇంటికి పంపకండి, మా అమ్మా నాన్న ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు మమ్ములను పట్టించుకోవడం లేదు.మీరు మీ పిల్లలతో ఆడుకున్నట్లుగా మా అమ్మా నాన్న మాతో ఆడుకోరు.

అందుకే మేము ఇద్దరం కూడా మీతోనే ఉంటాం.మిమ్ముల్ని అమ్మా నాన్న అంటాం అంటూ విజ్ఞప్తి చేశారు.

వారి విజ్ఞప్తికి కన్నీరు పెట్టుకున్న ఆ జంట జాక్‌ మరియు డైసీలను పిలిచి మాట్లాడారు.తమ గొడవ వల్ల పిల్లలు ఇంత మానసిక క్షోభను అనుభవిస్తున్నారా అని అర్థం చేసుకున్నారు.

అప్పటి నుండి పిల్లల కోసం మళ్లీ ఎప్పుడు కూడా గొడవ పడకూడదు అని నిర్ణయించుకున్నారు.

పిల్లల ముందు వారిద్దరు కనీసం గట్టిగా కూడా మాట్లాడుకోకుండా ఉండే వారు.

పక్కింటి తల్లిదండ్రుల మాదిరిగానే జాక్‌ మరియు డైసీలు కూడా కలిసి పిల్లలతో ఆడేవారు.పిల్లలకు వచ్చిన ఆ ఆలోచన తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుకు తెచ్చింది.ప్రతి పిల్లాడు కూడా బయటకు చెప్పకున్నా లోలోపల చాలా అంతర్మధనంకు గురి అవుతారు.తల్లిదండ్రుల ఆలన పాలన లేని పిల్లలే సమాజంలో చెడు దారిలో ప్రయాణిస్తారు.

అందుకే పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube