ఆ చిన్నారులు స్కూల్ కి ఎలా వెళ్తున్నారో తెలుసా.? ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.!

ఒకప్పుడు వానాకాలం చదువులు అనేవారు.వర్షం వస్తే ఇల్లే స్కూల్‌.

 Children Risk Lives Crossing River To Reach School In Assams Darrang1-TeluguStop.com

ఇల్లే ఆటస్థలం.ఆ రోజుల్లో పిల్లలని స్కూల్స్‌కి తీసుకు వెళ్లడానికి మాస్టార్లు ఇంటికి వచ్చేవారు.

గుమ్మంలో నిలబడి పిల్లల్ని పిలిచి వాళ్లకి తాయిలాలు పెట్టి, పిల్లల్ని చంకనేసుకుని తీసుకెళ్లేవారు.కన్నతండ్రి కంటే ఎక్కువ బాధ్యత తీసుకుని వాళ్లని ఉత్తమ పౌరులుగా తీర్చేవారు.

విద్యార్థులు కూడా గురువుల పట్ల గౌరవంగా ఉండేవారు.కానీ ఇప్పుడు అలా కాదు.

విద్యాసంస్థలు అన్ని వ్యాపార పరిశ్రమలగా మారిపోయాయి.ప్రస్తుత రోజుల్లో పిల్లలను స్కూల్ లో తల్లితండ్రులు దించుతారు లేదా వారే వెళ్తారు.

సిటీలలో అంటే ఓకే.స్కూల్ బస్సులు ఉంటాయి…ఎన్నో రవాణా సదుపాయాలు ఉంటాయి.కానీ ఇప్పటికి కొన్ని పల్లెటూరులలో సరైన రవాణా సంస్థలెదు.ప్రస్తుత 21వ శతాబ్ధంలోనూ దేశంలో అక్కడక్కడా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.అసోంలోని దారంగ్ పరిధిలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది.

సరైన రవాణా సదుపాయాలు లేని పూర్వం రోజుల్లో కొన్నిచోట్ల చిన్నారులు నదులను దాటుకుని మరీ స్కూలుకు వెళ్లి చదువుకునేవారని చెబుతుంటారు.అసోంలోని దారంగ్ పరిధిలోని ఇల్గావ్ స్కూలు చిన్నారులు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో నది దాటుతూ పాఠశాలకు వెళుతుంటారు.దీనికి సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారి అందరినీ ఆలోచింపజేస్తోంది.

అల్యూమినియం పాత్రలను వినియోగించి వీరు నదిని దాటుతున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube