అక్కడి వారు చదువుకోవాలంటే 4 ఏళ్ల వయసులోనే అన్ని వదిలేయాలి.. ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టించే కథనం

ప్రస్తుతం మనం కంప్యూటర్‌ యుగంలో ఉన్నాం.చదువుకోవాలంటే స్కూల్‌ కే వెళ్లాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదు.

 Children Of The Snow Land Have A Good Time At School-TeluguStop.com

ఇంట్లో ఒక రూంలో కూర్చుని కూడా నర్సరీ నుండి డిగ్రీల వరకు కూడా పూర్తి చేయవచ్చు.అంతటి పరిజ్ఞానం, ఇంటర్నెట్‌ వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు మినిమం చదవాలన్నా కూడా వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి.అంత ప్రయాణం ఉండటంతో ఎక్కువ శాతం పిల్లలు అక్కడ చదువుకు దూరంగా ఉంటున్నారు.

నేపాల్‌లోకి హిమాలయాల్లో ఉండే ఒక మారు మూల గ్రామంలోని పిల్లలు చదువుకోవాలంటే తమ తల్లిదండ్రులనే వదిలేయాల్సిందే.

అక్కడి వారు చదువుకోవాలంటే 4 ఏళ

ఆ గ్రామాల నుండి పట్టణంకు వెళ్లాలి అంటే కనీసం వారం రోజుల ప్రయాణం.అక్కడ నుండి నేపాల్‌ రాజధాని ఖాట్మాండ్‌కు వెళ్లాలి అంటే రెండు విమానాలు మారడంతో పాటు, మంచులో కనీసం మూడు రోజులు ట్రెక్కింగ్‌ చేస్తూ అక్కడకు వెళ్లాలి.అంత కష్టం ఉంటుంది కనుకే స్థానిక గ్రామస్తులు తమ పిల్లలకు చదువు వద్దు ఏం వద్దని తమ వద్దే ఉంచేసుకుంటున్నారు.

కాని జీవన్‌ మహాతర అనే కుర్రాడిని మాత్రం అతడి తల్లిదండ్రులు చదివించాలని భావించారు.అందుకోసం వారు ఏకంగా 12 ఏళ్లు త్యాగం చేశారు.ఈ 12 ఏళ్ల పాటు బాలుడిని పూర్తిగా దూరం ఉంచారు.ఈ 12 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా ఒకరిని ఒకరు చూసుకోలేదంటే మీరు నమ్మరేమో.

అక్కడి వారు చదువుకోవాలంటే 4 ఏళ

ఇటీవల తన చదువు పూర్తి చేసుకున్న జీవన్‌ తన తల్లిదండ్రులను చూడాలని ఆశ పడ్డాడు.అందుకోసం అతడి ప్రయాణం మొదలు పెట్టాడు.అతడి ప్రయాణంను ఒక మీడియా సంస్థ కవర్‌ చేసింది.అది కాస్త పెద్ద వైరల్‌ అయ్యింది.నాలుగు సంవత్సరాల వయసులో ఆ బాలుడు ఖాట్మండ్‌లో స్కూల్‌లో జాయిన్‌ చేశారు.ఇప్పుడు అతడికి 16 ఏళ్లు.12 సంవత్సరాల తర్వాత తన గ్రామంకు వెళ్లాడు.గ్రామంకు వెళ్లేందుకు అతడు రెండు విమానాలు మారడంతో పాటు, మంచులో నాలుగు రోజుల పాటు ట్రెక్కింగ్‌ చేశాడు.

అక్కడి వారు చదువుకోవాలంటే 4 ఏళ

సుదీర్ఘ ప్రయాణం, చాలా కష్టం తర్వాత అతడు తన గ్రామంకు చేరుకున్నాడు.మొదట అతడు తన తల్లిని గుర్తు పట్టలేక పోయాడు.ఆ తల్లి కొడుకును చూసిన ఆనందంలో కన్నీరు పెట్టింది.కేవలం ఆ తల్లి మాత్రమే కాదు, స్థానికులు అంతా కూడా జీవన్‌ను చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు.

వందల ఏళ్ల తమ గ్రామంలో ఒక చదువుకున్న కుర్రాడు ఉన్నాడని వారు పొంగి పోయారు.తమ గ్రామస్తులు ఇంకా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.వారి అభివృద్దికి నేను సాయం చేస్తానంటూ జీవన్‌ ప్రకటించాడు.తనలా మరెంతో మంది చదువుకు సాయం చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube