అమెరికాలో ఊహించని పరిణామం..డిసెంబర్ కల్లా...!!!

అమెరికాలో కరోనా రోజు రోజుకి వికృత రూపం దాల్చుతోంది.వేలాది మంది ప్రజలని పొట్టన పెట్టుంది.

 Children More Affected By Coronavirus America-TeluguStop.com

లక్షలాది మందిని పట్టి పీడిస్తోంది.కోలుకుంటున్న వారి సంఖ్య సంతోషాన్ని ఇచ్చేలోగానే మళ్ళీ వారికి కరోనా పాజిటివ్ రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

అసలు కరోనా అమెరికా పై ఇంతగా ప్రభావాన్ని చూపడానికి కారణం ట్రంప్ అంటూ అమెరికా ప్రజలు, పత్రికలు దుమ్మెత్తి పోస్తున్నారు.ఇదిలాఉంటే తాజాగా అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం అమెరికాని మరింత కలవర పెడుతోంది.

 Children More Affected By Coronavirus America-అమెరికాలో ఊహించని పరిణామం..డిసెంబర్ కల్లా…-Telugu NRI-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలో కరోనా బారిన పడిన పిల్లల సంఖ్య ప్రస్తుతం ఉన్నదానికంటే ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.అమెరికాకి చెందిన ఓ పరిశోధన సంస్థ చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడించింది.

కరోనా వ్యాప్తి ఇలానే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారడం ఖాయమని ఒక్కో ఐసీయూ బెడ్ కి 2381 మంది పిల్లలు పోటీ పడవలసిన పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు.

ఇదిలాఉంటే అమెరికాలో మార్చ్ 18 ఏప్రియల్ నెలల మధ్య సుమారు 74 మంది చిన్నారులు కరోనా కారణంగా ఐసీయూలో చేరారని పరిస్థితి చేయి దాటితే మాత్రం అదే కాలపరిమితిలో సుమారు 1.76 వేల మంది పిల్లలు ఐసీయూల్లో చేరే అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు.2020 చివరికి వరకూ ఇదే ఉదృతి కొనసాగితే మాత్రం అమెరికా జనాభాలో సుమారు 25శాతం మంది కరోనా బారినపడి వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉండి అంటున్నారు పరిశోధకులు.

#Media #Children #America #Population #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు