పిల్లలు అబద్ధాలు ఆడితే ఆ తప్పు తల్లిదండ్రులదే

“నాన్న పెన్ లో ఇంక్ అయిపోయింది , అయిదు రూపాయలు కావాలి” అని అడుగుతారు పిల్లలు.ఇచ్చిన అయిదు రూపాయలతో చాకొలేట్ కొనుక్కుంటారు కాని, ఇంక్ రిఫిల్ కొనుక్కోరు.అయిదు రూపాయల కోసం అబద్ధం.“అమ్మ కడుపులో నొప్పిగా ఉంది, ఈరోజు స్కూలుకి వెళ్ళను” అంటూ నంది అవార్డు వచ్చేట్టు నటిస్తారు.నిజానికి హొమ్ వర్క్ చేయకపోతేనో, టెస్ట్ ఎగోట్టడానికో అలా చెబుతారు పిల్లలు.ఇలా రకరకాల పనులకోసం రకరకాల అబద్ధాలు ఆడతారు పిల్లలు.ఏదోరోజు ఏదో ఒక అబద్ధం బయటపడుతుంది.అంతే సంగతులు.

 Children Lie With Lack Of Proper Communication With Parents-TeluguStop.com

ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ మీ పిల్లలే చేసినట్టు తిట్టిపోస్తారు.తాము చేసిన పనిలో ఇన్ని యాంగిల్స్ వెతుక్కోవచ్చా అని ఆశ్చర్యపోతారు పిల్లలు.

వారికి అబద్ధాలు ఆడాలని ఉంటుందా ? తల్లిదండ్రులని మోసం చేయాలని ఉంటుంది? నాన్న చాకొలేట్ అన్నప్పుడు కొనివ్వాలి, లేదంటే చాకొలేట్ ఎందుకు తినకూడదో అర్థం అయ్యేలా చెప్పాలి.అప్పుడు చాకొలేట్ పేరు చెప్పే డబ్బులు అడుగుతారు, లేదంటే తినడం మానేస్తారు.

హొమ్ వర్క్ చెయ్యి చెయ్యి అని అరవకపోతే, ఓ గంట వాళ్ళతో గడిపి, హొమ్ వర్క్ లో వారికి వస్తున్న కష్టం ఏంటో, ఎందుకు చేయలేకపోతున్నారో తెలుసుకుంటే, కడుపులో నొప్పి అనే నటన ఎప్పుడు చేయరు.

జ్వరం వస్తే మాత్ర వేయడం, సమయానికి తిండి పెట్టడమే తల్లిదండ్రుల బాధ్యత కాదుగా.

మీతో ఒక విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే, మీతో బాగా మాట్లాడే అలావాటు వారికి ఉండాలి.అందుకే పిల్లలతో మాట్లాడండి, వారు కూడా మాట్లాడే స్వేచ్చనివ్వండి.అలా చేయడం చేతకాక, పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు అంటే, అది తల్లిదండ్రుల తప్పే .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube