ఆఫ్ఘాన్‌లో చ‌దువుకు బ‌దులు అలాంటివి నేర్చుకుంటున్న పిల్లలు..

ఆఫ్ఘాన్‌‌ను తాలిబన్లు వశపరుచుకుని దాదాపు మూడు నెలలు పూర్తవుతున్నది.అయినా అక్కడ ఇంకా పరిస్థితులు చక్కబడలేదు.

 Children Learning Such Things Instead Of Studying In Afghanistan , Afghanistan,-TeluguStop.com

ఆ దేశంలోని దక్షిణ హల్మండ్ ప్రావిన్స్‌ లో, నాద్ ఎ అలీతో సహా పలు గ్రామాల్లో పిల్లలకు చదువుకు బదులు ప్రాణాలు రక్షించుకునే విద్య నేర్పుతున్నారు.వారికి క్షిపణికి సంబంధించిన పార్ట్స్, ఆయుధాలు, ల్యాండ్‌మైన్‌లను గుర్తించడం నేర్పిస్తున్నారు.

అయితే వాస్తవానికి ఈ ప్రాంత ప్రజలు తాలిబన్లతో చివరి వరకు పోరాటం చేశారు.ఇక తాలిబన్లు ఆయా గ్రామాలను ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పారిపోయారు.

ప్రస్తుతం వారు తిరిగి గ్రామాలకు వస్తున్నారు.ఈ గ్రామాల్లో ఇళ్లు, స్కూళ్లు శిథిలావస్తకు చేరుకున్నాయి.అందులో మోర్టార్లు, బుల్లెట్స్‌తో నింపేశారు.తాలిబన్ యోధులు, రోడ్లుపై, పొలాల్లో మందుపాతరలు వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

అందుకు భూమిలో పాతిపెట్టిన మందుపాతరలను, పేలుడు పదార్థాలను గుర్తించే పనిలో ఉన్నారు.అయితే మైదానాలు, దారుల్లో ఉన్న గనుల పట్టులో పిల్లలు, స్త్రీలు పడిపోకుండా వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతున్నారు.

పరిసర ప్రాంతాలను పరిశోధిస్తూ.గ్రామస్తులను, తమ పిల్లలను రక్షించుకునేందుకు వారికి ఆయుధాలకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు.ఇందులో లేండ్‌మైన్ అనే డౌట్ వస్తే ఏం చేయాలి? క్షిపణికి సంబంధించిన శిథిలాలు కంటపడితే ఎంత దూరంలో ఉండాలి? బుల్లెట్ల అవశేషాలు కనిపిస్తే ఏమేం చేయాలనే విషయాలను నేర్పిస్తున్నారు.సోదాలను జరిపిన ప్లేసులన్నీ తెలుపు, ఎరుపు రాళ్లతో మార్కింగ్ చేసేస్తున్నారు.

తెలుపు రంగు ఉంటే అది సురక్షిత ప్రదేశమని, ఎరుపు రంగు ఉంటే అక్కడ మందుపాతరలు ఉన్నాయని సంకేతంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.మొత్తానికి పలకా బలపం పట్టాల్సిన పిల్లల చేతులు ఇలా ఆయుధాలు పట్టడం బాధాకరం అంటూ కొందరు వాపోతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube