పెద్దవాళ్లకే శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయాలంటే ఆమడ దూరం పారిపోతుంటారు.అలాంటిది ఓ కిండర్ గార్డెన్ (ఎల్కేజీ, యూకేజీ) పాఠశాల చిన్నపిల్లలకు ఉదయాన్నే ఐస్ వాటర్ తో చల్లటి నీటితో స్నానం చేయించాలని ఓ పాఠ్యాంశాన్నే చేర్చింది.
ఆశ్చర్యం వేస్తుంది కదూ.ఇది నిజం.ప్రతిరోజు 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు మించకుండా హాట్ సౌనా (శరీరం పొడిగా వేడెక్కేలా చేసే ప్రక్రియ) చేసుకున్న తర్వాత ఇలా చన్నీటి స్నానం చేయాలని నిబంధనను పెట్టింది.ఇప్పటికే ఈ నిబంధనల ఓ స్కూల్ లో కూడా అమలు అవుతోంది.
సైబిరియా దేశంలోని ఓ స్కూల్ లో చన్నీటితో స్నానం చేయాలనే నిబంధనను పెట్టారు.ఇలా చేయడం వల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్ రాదని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పాఠశాల యాజమాన్యం చెబుతోంది.
దీని వల్ల బ్రీథింగ్ ఎక్సర్ సైజ్ కూడా జరుగుతుందన్నారు.చన్నీటి స్నానం చేసినట్లయితే శరీరంలో ఉషోగ్రత పెరుగుతుందని, దీంతో బ్రిథింగ్, నరాల్లో రక్తప్రసరణ వేగం పెరుగుతుందన్నారు.
హాట్ సౌనాలో పిల్లలు తొలుత వేడి వాతావరణంలో ఉంటారని పాఠశాల యాజమాన్యం తెలిపింది.ఆ తర్వాత సంప్రదాయరీతిలో పిల్లలకు చన్నీటి స్నానం చేయించాలని క్రస్నోయార్క్స్ విద్యా విభాగం తెలిపింది.
చిన్నపిల్లలు చాలా సెన్సిబుల్ గా ఉంటారని, బ్యాలెన్సింగ్ ఉండేందుకు చన్నీటి స్నానం చేయిస్తున్నామని పేర్కొన్నారు.ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నామని, తరచూ ఐస్ వాటర్ తో స్నానం చేయించాలంటే ఎంతో శక్తి ఉండాలి, ఇలా స్నానం చేయించడం వల్ల పిల్లలు స్ట్రాంగ్ గా అవుతారని వారు వెల్లడిస్తున్నారు.
పిల్లలకు ఇష్టముంటేనే చన్నీటితో స్నానం చేయాలని చెబుతున్నామని ప్రీస్కూల్ ఉపాధ్యాయురాలు, స్విమ్మింగ్ కోచ్ ఒకాసన కబోత్కో తెలిపారు.చన్నీటితో స్నానం చేయడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని, జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు పిల్లల్లో వైరస్‌తో పోరాడే శక్తి పెరుగుతుందని కొందరు వైద్యులు చెబుతున్నారని ఉపాధ్యాయురాలు ల్యుబోవ్ దనిల్ సోనా చెప్పారు.
అయితే చిన్నపిల్లలకు ఐస్ వాటర్ తో స్నానం చేయించడంపై పలువురు వారి వాదనలు చేస్తున్నారు.పెద్దవాళ్లే చన్నీటితో స్నానం చేయరని, చిన్నపిల్లలకు ఐస్ వాటర్‌తో స్నానం చేయిస్తే ఎలా తట్టుకుంటారని ఆరోపిస్తున్నారు.
.