ఆకలి తట్టుకోలేక కప్పలు తిన్న చిన్నారులు

ఇండియా అంటే ప్రతి ఒక్కరు చూసేది కాస్మోపాలిటన్ నగరాలు, అందంగా కనిపించే పల్లెటూళ్ళు మాత్రమే.అయితే ఆ నగరాలలో, ఆ పల్లెల్లో ఒక్కపూట కూడా తినడానికి లేక పేదరికంగా బ్రతికే ప్రజలు కోట్లలో ఉంటారు.

 Children Caught Eating Frogs To Fight Hunger In Bihar, Lock Down, Corona Effect,-TeluguStop.com

ప్రభుత్వాలు మారిన వారి జీవన శైలి మాత్రం మారదు.ప్రజలలోని కొంత మంది నిర్లక్ష్యం, బాధ్యతలేని తనం కారణంగా ఏందో మంది చిన్నారులు అనాధలుగా మారి రోడ్డున పడుతున్నారు.

వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో తెలియకుండా బ్రతుకులు సాగిస్తున్నారు.ఇలాంటి వారికి ఒక్కపూట కడుపు నింపుకోవడం కోసం ముప్పతిప్పలు పడతారు.

ప్రస్తుతం లాక్ డౌన్ వారికి మరింత కఠినంగా మారింది.ఈ లాక్ డౌన్ కారణంగా తినడానికి తిండి లేక ఎంతో మంది ఆకలి బాధలతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో జెహనాబాద్ కు చెందిన కొందరు చిన్నారులు ఆకలికి తట్టుకోలేక కొంత‌మంది చిన్నారులు క‌ప్ప‌ల‌ను ఆహారంగా తీసుకున్నారు.

లాక్‌డౌన్ వ‌ల్ల ఎంతోమంది పేద‌ల‌కు పూట గ‌డ‌వ‌టం క‌ష్టంగా మారింది.

దీంతో కొంద‌రు చిన్నారులు ఐదు రోజులుగా తిండి దొర‌క‌పోవ‌డంతో క‌ప్ప‌ల‌ను తింటూ క‌డుపు నింపుకుంటున్నారు.ఇందుకోసం గుంత‌ల్లో, మురికి కాలువ‌లో ఉన్న క‌ప్ప‌ల‌ను వేటాడుతూ వాటిని ఆహారంగా భుజిస్తున్నారు.

ఇది చూసిన కొందరు ఎందుకు క‌ప్ప‌ల‌ను తింటున్నార‌ని ఆ చిన్నారులను ప్ర‌శ్నించ‌గా అన్నం తిన‌క ఐదు రోజుల‌వుతుందంటూ వారి ద‌య‌నీయ ప‌రిస్థితిని వివ‌రించారు.ఇంట్లో వండుకోడానికి ఏమీ లేవ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆహారం ఎక్కడా దొరకడం లేదని మ‌రో మార్గం లేక ఇలా క‌ప్ప‌ల‌ను తింటున్నామ‌ని చెప్పారు.

ఈ సంఘటనని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో జిల్లా మెజిస్ట్రేట్ న‌వీన్ కుమార్ ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube