అమెరికాలో మరో సారి పేలిన తూటా...!!!   Child Injured In Gunfire Exchange At Alabama Shopping Mall     2018-11-24   11:40:24  IST  Surya

అమెరికాలో రోజు రోజు కి గన్ కల్చర్ హెచ్చు మీరుతోంది…దుండగుల వరుస దాడులతో అమెరికా ప్రజలు భయ భ్రాంతులకి లోనవుతున్నారు…ఒక్క నెల కాలంలోనే దాదాపు మూడు సార్లు ఈ రకమైన దాడులు దాడులు జరగడంతో అమెరికా ప్రజలలో ఆందోళన నెలకొంది..ఎప్పుడు ఎక్కడా దాడులు ఎటువైపు నుంచీ దుండగులు వచ్చి దాడులు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది..ఇదిలాఉంటే

తాజాగా జరిగిన మరో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది..అమెరికా అలబామా రాష్ట్రంలో హువర్ నగరంలోని ఒక షాపింగ్ మాల్‌లో ఈ ఘటన జరిగింది..ఈ షాపింగ్ మాల్ లో ఇద్దరి వ్యక్తులు గొడవలు పడుతూ ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీ తో కాల్పులు జరపగా అవతలి వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు..

Child Injured In Gunfire Exchange At Alabama Shopping Mall-

ఈ ఘటనలో 12 ఏండ్ల బాలిక సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు…పోలీసులు తెలిపిన కధనం ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తి పై దాడి చేయడంతో ఈ ఘటన జరిగిందని అయితే కాల్పులకి సంభందించి గొడవ ఒక్కటే కారణమా మరేదన్నా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.