తల్లి లైవ్ లో మాట్లాడుతుండగా…. పెయింటింగ్ పట్టుకొచ్చిన చిన్నారి!  

Child Hilariously Crashes interview,Demanding To Know Anchor’s Name, Child, News Reporter, Doctor Carle Venham,Preasure Unicorn,Skarlet - Telugu Child, Doctor Carle Venham, News Reporter, Preasure Unicorn, Skarlet

ఏమి మహమ్మారో ఏమో గానీ చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ కూడా నానా తిప్పలు పడుతున్నారు.ఆ మీడియా,ఈ మీడియా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో నుంచే తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి వస్తుంది.

 Child Hilariously Crashes Interviewdemanding To Know Anchors Name

ఇలాంటి సమయంలో చాలా మంది తమ భాద్యతలు నిర్వర్తించే క్రమంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా ఒక భాగమై పోతున్నారు.ఆ మధ్య ఒక న్యూస్ రిపోర్టర్ ఇంటి నుంచి లైవ్ చేస్తున్న సమయంలో ఆమె తండ్రి అర్ధనగ్నంగా అటుగా రావడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు రాగా.అందులోని చిన్నారికి అందరూ ఫిదా అవుతున్నారు.

తల్లి లైవ్ లో మాట్లాడుతుండగా…. పెయింటింగ్ పట్టుకొచ్చిన చిన్నారి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అసలు వివరాల్లోకి వెళితే… లండన్‌ స్కూల్‌ ఆఫ్ ఎకనమిక్స్‌లో పనిచేసే డాక్టర్ క్లారే వెన్‌హమ్‌ ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.కరోనాపై ఆమె మాట్లాడుతుండగా.

క్లారే కుమార్తె స్కార్‌లెట్‌ తాను వేసిన యూనికార్న్ పెయింటింగ్‌తో రూమ్‌లోకి వచ్చింది.ఆ తరువాత దీన్ని ఎక్కడ పెట్టాలంటూ తల్లిని అడగ్గా.

క్లారే ఓ సెల్ఫ్‌లో పెట్టమని చూపించింది.దానికి ఇంటర్వ్యూ చేస్తున్న ఫ్రేజర్‌ యూనికార్న్ చాలా బావుందని, దాన్ని కింద షెల్ఫ్‌లో పెట్టాలని క్లారేకి తెలిపారు.

ఇక ఆ తరువాత తల్లి వద్దకు వచ్చిన స్కార్‌లెట్‌ అతడి పేరు ఏంటమ్మా అని ప్రశ్నించింది.దానికి క్లారే క్రిస్టియన్‌ ఫ్రేజర్‌ అని సమాధానం ఇచ్చారు.ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఆ చిన్నారికి అందరు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.మరోపక్క ఇలా ఇంటి నుంచే ఇంటర్వ్యూలలో పాల్గొనే చిన్న పిల్లల తల్లిదండ్రులకు ఈ తిప్పలు తప్పవంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

#Skarlet #Child

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Child Hilariously Crashes Interviewdemanding To Know Anchors Name Related Telugu News,Photos/Pics,Images..